.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -314 లో...జయ చేత పైడిరాజుకి విశ్వ సారీ చెప్పిస్తాడు. దాంతో జయ కోపంగా తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని వీరుకి కాల్ చేస్తుంది. నన్ను ఇక్కడ వదిలేసి మీరు అక్కడ హ్యాపీగా ఉన్నారా అని జయ కోప్పడుతుంది. వీళ్ళు అందరు ఏమో గానీ ఆ రుద్ర మాత్రం సామాన్యుడు కాదు నా గురించి నిజం బయటపెట్టాలని ట్రై చేస్తున్నాడని జయ అంటుంది. నువ్వు అన్నావ్ వాళ్ళందరు నా ముందు జుజుబి అన్నావ్ కదా అని వీరు అంటాడు. నువ్వు ఏం కంగారుపడకు అంత నేను చూసుకుంటానని వీరు అంటాడు.
ఆ తర్వాత గంగ కోపంగా బయటకి వస్తుంది. ఆ జయ మా నాన్నని చెప్పులు కుట్టించుకొని రమ్మని చెప్తుందా దాని సంగతి చెప్పాలని గంగ అంటుంది. ఆల్రెడీ సారీ చెప్పించాను కదా అని రుద్ర అంటాడు. అయినా నీ ఫ్రస్టేషన్ తగ్గకుంటే మీ అన్నయ్యని జయ అనుకొని నీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోమని రుద్ర అనగానే రంగాని కొడుతుంది గంగ. ఆ తర్వాత కార్తీక్ ని ప్రమీల ఒక దగ్గరికి రమ్మని చెప్తుంది. మీకొక గిఫ్ట్ తెచ్చానని చెప్పి అతని కళ్ళ కోసం బ్లాక్ కూలింగ్ గ్లాసెస్ ఇస్తుంది. అవి చూసి కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకు ఎందుకు ఇచ్చారని కార్తీక్ అడుగుతాడు. మొన్న మీ బర్త్ డే కి ఇవ్వలేదు కదా అని ప్రమీల చెప్తుంది. వాళ్లకి కాస్త దూరంలోనే శకుంతలతో ఒకావిడ మాట్లాడుతుంది. మీరు చాలా గ్రేట్ అండి.. మీ ఫ్యామిలీ ఎందరికో ఆదర్శం మీ కోడలు ప్రమీల అయితే చాలా మంచిదని ఆవిడ అంటుంది.
అవును నా కోడలు చాలా పద్ధతి గల అమ్మాయి.. తను ఇప్పుడు సొంతంగా బిజినెస్ కూడా చూసుకుంటుందని శకుంతల గొప్పగా చెప్తుంది. మరొకవైపు ప్రీతీ కోసం గంగ పాలు తీసుకొని వెళ్తుంటే అప్పుడే రుద్ర వస్తాడు. ఏం చేస్తున్నావని రుద్ర అడుగుతాడు. ప్రీతీ కోసం పాలు తీసుకెళ్తున్నానని గంగ అనగానే ఇంత లేటుగానా తీసుకొని వెళ్ళేదని కోప్పడుతాడు. అందులో కుంకుమ పువ్వు మర్చిపోయావని చెప్పి రుద్ర ఆ పాలల్లో కుంకమ పువ్వు వేస్తాడు. అదంతా శకుంతల, పెద్దసారు చూస్తారు. చూసావా ప్రీతి అంటే రుద్రకి ఎంత ఇష్టమో అని పెద్దసారు అనగానే ఉన్న ఒక అన్నని దూరం చేసాడని శకుంతల కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత మా ఆయన వల్ల నేను కూడా అత్తయ్యలాగా ఇంటికి దూరం అవుతానేమోనని ప్రీతీ ఏడుస్తుంటే.. అలా ఎప్పుడు జరగదని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
