.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -303 లో..... కార్తీక్ కోసం ప్రమీల వంట చేసి తీసుకొని వస్తుంది. అది చూసి మక్కమ్ షాక్ అవుతాడు. మేడం నాకోసం మంచి నాన్ వెజ్ తీసుకొని వచ్చి ఉంటుందని కార్తీక్ బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో ఆకుకూరలు, క్యారెట్ ఉంటుంది. అది చూసి మక్కమ్ నవ్వుకుంటాడు. మేడమ్ మీ కళ్ల గురించి జాగ్రత్త తీసుకొని అవన్నీ చేసి ఉంటుంది. మీరు కూడా జాగ్రత్త తీసుకోండి అని మక్కమ్ అనగానే అవును ఈ కళ్ళు నాకూ చాలా స్పెషల్.. ఎవరో డొనేట్ చేసి నాకు జీవితం ఇచ్చారని కార్తీక్ అనగానే అయ్యో సారీ బ్రో అని మక్కమ్ అంటాడు.
ఆ తర్వాత మక్కమ్, కార్తీక్ భోజనం చేస్తుంటే అప్పుడే ప్రమీల వచ్చి నేను వడ్డీస్తానని అంటుంది. నేను ఇదంతా చూడనని మక్కమ్ అక్కడ నుంచి వెళ్తాడు. అప్పుడే అక్కడికి ప్రమీల వాళ్ళ నాన్న వస్తాడు. అతన్ని ఆపాలి.. లేదంటే గొడవ జరుగుతుందని మక్కమ్ అనుకొని అతని దగ్గరికి వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాడు. అయినా వినకుండా అతను లోపలకు వెళ్తాడు. కార్తీక్ చేతిపై వేడి అన్నం పడుతుంది.. అయ్యో అని తన చెయ్ పట్టుకుంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి నువ్వు చేస్తున్న బాగోతం ఇదా అని ఇష్టం వచ్చినట్లు తిడుతాడు. కార్తీక్ ని కొట్టబోతుంటే అప్పుడే రుద్ర వచ్చి ఆపుతాడు. కార్తీక్ ని అక్కడ నుంచి పంపిస్తాడు. ప్రమీల ఎప్పటికి తప్పు చెయ్యదు. భాను కళ్ళు కార్తీక్ కి డొనేట్ చేశారు. అందుకే ప్రమీల కాస్త చనువుగా ఉంటుందని మొత్తం జరిగిందంతా రుద్ర చెప్పగానే ప్రమీలకి వాళ్ళ నాన్న సారీ చెప్తాడు. మరొకవైపు వీరుకి మనోహర్ కాల్ చేసి సూర్య చేస్తున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయించానని చెప్తాడు.
మరొకవైపు ఇంట్లో అందరు రుద్ర గురించి గొప్పగా మాట్లాడుతారు. ఆ విశ్వ సర్ ని ఊరొదిలి వెళ్లకుండా ఆపాడని గంగ చెప్తుంది. నా కొడుకు గ్రేట్ అని పెద్దసారు అంటాడు. కోడళ్లు కూడా గ్రేట్ అని గంగ అంటుంది. మీరు చెప్పండి అమ్మ అని శకుంతలతో గంగ చెప్పిస్తుంది. అవును ప్రమీల బిజినెస్ చూస్తుంది.. గంగ ఛాంపియన్.. ఇషిక బిజినెస్ లో ఇప్పుడే సక్సెస్ అవుతుందని పెద్దసారు అంటాడు.. అప్పుడే ఇషిక, సూర్య డల్ గా వస్తారు. వీరు కావాలనే ఇషిక చాలా గ్రేట్ అంటూ మాట్లాడతాడు. ఇప్పుడే వచ్చామ్ కదా టైడ్ అయ్యామని సూర్య, ఇషిక పైకి వెళ్తారు. వాళ్ళని రుద్ర గమనిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
