.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-414 లో ఇంట్లో ఉన్న డబ్బు కనిపించడం లేదు.. ఈ వీరు తీసుకొని వెళ్లి ఎవరికో ఇవ్వడం నేను చూశానని రంగా అనగానే ఏంటి రంగా నా అల్లుడు మీద నిందలు వేస్తున్నావని శకుంతల కోప్పడుతుంది. డబ్బులు నేను బ్యాంకుకి లోన్ అప్లై చేసుకొని అప్పు ఇచ్చే వాళ్లకి ఇచ్చానని వీరు దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తాడు.
అప్పుడే రుద్ర గదిలో చూసి వచ్చి డబ్బు లేవని క్లారిటీ ఇస్తాడు. సర్ డబ్బు ఈ వీరు తీశాడని గంగ అనగానే రంగా, గంగ, వీరుని రుద్ర పక్కకి తీసుకొని వెళ్లి డబ్బు వీరు తీయలేదు, వంశీ తీశాడని రుద్ర చెప్తాడు. వంశీ తీసి ఆ డబ్బులు జయకి ఇచ్చాడు.. డైమండ్ నెక్లెస్ కొనుక్కోమని ఇచ్చాడు అనగానే రంగా, గంగ షాక్ అవుతారు.
ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే పిన్ని బాబాయ్ వాళ్లు వంశీ అలా చేశాడంటే తట్టుకోలేరు.. జయ దగ్గర డబ్బు ఉందని తెలిస్తే విశ్వ మావయ్య ఊరుకోడు అని రుద్ర అంటాడు. ఆ తర్వాత రంగా, గంగ వెళ్లి వీరుకి సారీ చెప్తారు. ఇప్పుడు డబ్బు ఏమైనట్లు, గంగ వాళ్ల పేరెంట్స్ తీసి ఉంటారని జయ అంటుంది. దీంతో గంగకి కోపం వస్తుంది.. మా అమ్మనాన్న ఎందుకు తీస్తారు.. నీ బ్యాగ్ లో డబ్బు ఉంటుందని గంగ ఆవేశంగా జయ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో డబ్బు ఉంటుంది.
దీంతో అందరు షాక్ అవుతారు. నా బ్యాగ్ లో డబ్బు ఎలా వచ్చింది.. నువ్వే నాపై కోపంతో పెట్టి ఉంటావని జయ నటించగా అనగానే వంశీ పేరు చెప్పలేక గంగ సైలెంట్ అవుతుంది. నా కూతురు మీ ఇంటికి కోడలు కాకముందే ఇలా నిందలు వేశారు.. ఇక కోడలు అయితే ఎలా ఉంటుంది.. ఇప్పుడే వీళ్ల పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పి విశ్వ వెళ్లిపోతుంటే రుద్ర ఆపుతాడు. జయ డబ్బు తియ్యలేదు కానీ ఆ డబ్బు జయ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో తెలుసని రుద్ర అంటాడు. ఆ తర్వాత వంశీని పిలుస్తాడు రుద్ర. ఆ డబ్బు జయ బ్యాగ్ లోకి ఎలా వచ్చిందని రుద్ర అడుగుతాడు. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
