.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -334 లో.. పెద్దసారు విశ్వ ఫ్యామిలీని ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత ఎందుకు రుద్ర బావ వీరు చెప్పిన దానికి ఒకే చెప్పి జయ పెళ్లి చేస్తున్నాడు. అసలు జయ సొంత కూతురు కాదని బావకి తెలుసు ఎందుకు ఇలా చేస్తున్నాడో కారణం చెప్పాలని గంగతో రంగా అంటాడు. రుద్రని గంగ లాక్కొని గదిలోకి వస్తుంది.
మా అన్నయ్య బాగా సీరియస్ గా ఉన్నాడని గంగ అంటుంది. ఎందుకని అని రుద్ర అడుగుతాడు. ఆ వీరు కి సపోర్ట్ చేస్తున్నారు ఏందుకని రంగా కోపంగా మాట్లాడుతాడు. ఇప్పుడు చెప్పను ఏం చేస్తావని రుద్ర అనగానే రంగా కాళ్ళు పట్టుకొని అడుగుతాడు. అన్నయ్య ఏంటి అది అని గంగ అంటుంది. అయిన రుద్ర చెప్పకుండా వెళ్తాడు. ఈ విషయం మనం అయిన విశ్వ సర్ కి చెప్పాలని రంగా, గంగ అనుకుంటారు. విశ్వ వేరే వాళ్లతో ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే రంగా వెళ్లి తన మొహం చూసి కాకుండా పక్కకి తిరిగి జయ మీ కూతురు కాదని చెప్తుంటాడు కానీ విశ్వ వెళ్లి రుద్ర వస్తాడు. రుద్రని చూసి రంగా షాక్ అవుతాడు. ఏంటి మీరు చేస్తుంది.. ఈ మాత్రం నాకు చెప్పడం చేత కాకనా అని రంగాపై రుద్ర కోప్పడతాడు.
ఆ తర్వాత అందరు జయని రెడీ చేస్తుంటారు. ప్రమీల వచ్చి నా నగలు ఇవ్వాళా అని అడుగుతుంది. వద్దు అసలు నీలాంటి వాళ్ళు ఇలాంటి వాటికి రావద్దని తెలియదా అని జయ కోప్పడుతుంటే అపర్ణ తనపై కోప్పడుతుంది. ఇక్కడ గొడవ అవుతుందని వెంటనే వీరుకి ఇషిక చెప్తుంది. నువ్వేం మాట్లాడావో విశ్వ సర్ దగ్గరికి తీసుకొని వెళ్లి చెప్తానని గంగ అనగానే అప్పుడే వీరు వచ్చి వద్దని ఆపుతాడు. ఫంక్షన్ డిస్టబ్ అవుతుందని వీరు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
