.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -332 లో...... జయ పెళ్లి శకుంతల పెద్దసారు చేతుల మీదుగా జరిపించడానికి శకుంతల ఒప్పుకుంటుంది. ఆ విషయం విశ్వకి పెద్దసారు ఫోన్ చేసి చెప్తాడు. పెళ్లి విషయంలో నువ్వేం కంగారు పడకు విశ్వ... అబ్బాయి వాళ్ళు ఆస్తులు అవసరం లేదు.. కట్నం అవసరం లేదు.. మాకు పెద్ద కుటుంబం ఉంటే చాలన్నారంట కదా.. అయితే అది మంచి కుటుంబం.. వదులుకోకు ఆ సంబంధం ఖాయం చేసుకో పెళ్లి మా చేతుల మీదుగా జరిపిస్తాం.. అమ్మాయికి అందరు ఉన్నారని చెప్పమని పెద్దసారు అంటాడు.
ఒకసారి సుధాకి ఇవ్వు శకుంతల మాట్లాడుతుందని పెద్దసారు అంటాడు. శకుంతల కోపంగా ఫోన్ తీసుకొని మీరు పెళ్లి గురించి టెన్షన్ పెట్టుకోకండి రేపు గ్రాండ్ ఎంగేజ్మెంట్ జరిపిద్దామని శకుంతల అనగానే సుధా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత జయ ఎంగేజ్మెంట్ కి ఏ చీర కట్టుకోవాలని ఇందుమతి వచ్చి అంటుంది. ఈ నెక్లెస్ ప్రమీల, భాను పెళ్ళి లో కొన్నది అని ఇందుమతి అనగానే అందరు బాధపడతారు. నా కోడలు ఒక మూలన ఉండడం నాకు బాధగా ఉందని శకుంతల అనగానే అయితే పెళ్లి చెయ్యండి అని గంగ అంటుంది. ఏం మాట్లాడుతున్నావని గంగపై శకుంతల కోప్పడుతుంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమేనా అని రుద్ర కూడా గంగపై కోప్పడతాడు.
ఆ తర్వాత గంగ ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తుంటే అప్పుడే రుద్ర వస్తాడు. ఏ చీర కట్టుకోవాలి సర్ అని గంగ అడుగుతుంది. బాక్సింగ్ డ్రెస్ ఇచ్చి ఇది వేసుకో.. నువ్వు దీనిపై మాత్రమే శ్రద్ధ పెట్టాలి.. ఈ చీరల సెలక్షన్ ఏంటి అయిన నిన్ను మావయ్య ఓల్డ్ వీడియోస్ చూడమని చెప్పాను కదా అని రుద్ర కోప్పడతాడు. అప్పుడే రంగా వస్తాడు. అన్నాచెల్లెల్లని ఇద్దరి రుద్ర కలిపి తిడతాడు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు వీరు దగ్గర ఉండి చూసుకుంటాడు. అప్పుడే రంగా వచ్చి మాట్లాడుతుంటే రుద్ర వస్తాడు. ఇవన్నీ చెయ్యడానికి కారణం నేనే అని వీరు గొప్పగా చెప్తాడు. ఇందులో ఏదైనా మోసం ఉంటే మాత్రం నేను ఊరుకోనని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
