
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -206 లో భాను సంవత్సరికానికి రుద్రని రావొద్దని చెప్పడంతో రుద్ర ఇంట్లోనే ఉంటాడు. తనతో పాటు గంగ కూడా ఉంటుంది. సంవత్సరికం ఆపి.. అది రుద్ర ఆపడానికి క్రియట్ చెయ్యడానికి వీరు ప్లాన్ చెస్తాడు. అందులో భాగంగానే వాళ్ళు వెళ్తున్న కార్ ని ఫాలో అవుతూ కొంతమంది కార్ పై కోడిగుడ్లు విసురుతారు. దాంతో శకుంతల వాళ్ళు భయపడుతారు. ఎవరు ఇదంతా చేస్తుందని వాళ్ళు అనుకుంటారు. ఇంకెవరు రాకుండా ఉన్నవాళ్లు ఇలా చేసి ఉంటారని ఇషిక అంటుంది.
అయితే రుద్ర అన్నయ్య అంటున్నావా అని సూర్య అంటాడు. రుద్ర బావ కాదు గంగ చేసి ఉంటుందని ఇషిక అనగానే.. ఆపండి వాళ్ళని రాకుండా చేసిందే కాకుండా ఇలా మాట్లాడతారా అని పెద్దసారు కోప్పడతాడు. ఆ తర్వాత సూర్య జరిగింది మొత్తం రుద్రకి ఫోన్ చేసి చెప్తాడు. ఆ విషయం రుద్ర, గంగకి చెప్తాడు. ఇదంతా ఆ వీరు ప్లాన్.. అది ఆపాలని మీరే చేశారని మీ పెద్దమ్మ దృష్టిలో బ్యాడ్ చెయ్యాలని చేశారని గంగ అంటుంది. వాడి ప్లాన్ వాడికే తిప్పికొడుతానని రుద్ర అంటాడు. గంగకి ఏదో ప్లాన్ చెప్తాడు. రుద్ర గదిలోకి కోపంగా వెళ్లినట్టు వెళ్తాడు. సర్ డోర్ తియ్యండి అని బయట గంగ అరుస్తుంటే అప్పుడే ప్రీతీ వచ్చి ఏమైందని అడుగుతుంది. మీ అమ్మ అన్న మాటలకి సర్ ఫీల్ అయ్యి నన్ను ఒంటరిగా వదిలేయ్ అంటున్నాడని గంగ చెప్తుంది. అన్నయ్యని కాసేపు ఒంటరిగా వదిలియ్ అని ప్రీతీ చెప్తుంది. రుద్ర వెనకాల నుండి వెళ్లి శకుంతల వాళ్ళు వెళ్తుంటే ఇబ్బంది పెడుతున్న వాళ్ళని కొడతాడు. వాళ్ళు ఇంకా రావట్లేదని వీరు చూస్తాడు. పక్కన వాళ్ళు పడిపోయి ఉంటే వాళ్ళని ఎవరు కొట్టారని వీరు అనుకుంటారు. ప్రీతీ కి ఫోన్ చేసి రుద్ర బావ ఏం చేస్తున్నాడని అడుగతాడు. అన్నయ్య లోపల గదిలోన ఉన్నాడని ప్రీతీ చెప్తుంది.
రుద్ర అక్కడే ఉంటే వీళ్ళని ఎవరు కొట్టారని వీరు అనుకుంటాడు. అప్పుడే రుద్ర ఎదురుగా హెల్మెట్ పెట్టుకొని వస్తాడు. వీరు దగ్గరికి వెళ్లి.. ఒరేయ్ నేనేం చెప్పాను.. మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు కొట్టారని అడుగుతాడు. దాంతో రుద్ర కోపంతో వీరుని కొట్టి వెళ్ళిపోతాడు. శకుంతల వాళ్ళు వచ్చి వీరు దెబ్బలు బాగా తగిలినట్లు ఉన్నాయని సానుభూతి చూపిస్తారు. సంవత్సరికానికి లేట్ అవుతుందని అందరు వెళ్తారు. ఎవరు కొట్టారు అని వీరుకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ తర్వాత భానుకి సంవత్సరికం జరిపిస్తారు. అదంతా రుద్ర దూరం నుండి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






