
జబర్దస్త్ నుంచి మరో సీనియర్ మోస్ట్ కమెడియన్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఈ షో నుంచి ఎక్కడికీ వెళ్ళలేదు. ఆయనే రాకెట్ రాఘవ. ఆయన కామెడీ క్లీన్ కామెడీ అంటూ బిరుదులూ కూడా ఇచ్చారు ఆడియన్స్. వాళ్ళ అబ్బాయి కూడా జబర్దస్త్ షోలో వాళ్ళ నాన్నతో పాటు అప్పుడప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు రాఘవ డైరెక్టర్ గా రంగప్రవేశం చేయబోతున్నారు.
"ఇప్పటి వరకు రాకెట్ రాఘవ పేరుతో నా కామెడీతో మిమ్మల్నందరినీ ఎంటర్టైన్ చేసాను. ఇప్పుడు ఎం.ఎస్. రాఘవేంద్ర అనే పేరుతో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఒక చక్కటి సినిమాకు డైరెక్ట్ చేస్తూ త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. " అంటూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా పేరు "అలా అలా జరిగింది" అంటూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
ఇక జబర్దస్త్ కమెడియన్స్ నుంచి హీరోలుగా, డైరెక్టర్స్ గా, ప్రొడ్యూసర్స్ గా ఇలా సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళ సత్తా నిరూపించుకుంటున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను, బలగం వేణు, ధనరాజ్, ఇమ్మానుయేల్, రాకింగ్ రాకేష్, అభి ఇలా ఎంతోమంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ కోవలోకి వచ్చేసాడు రాకెట్ రాఘవ. ఇటు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తన సత్తా నిరూపించుకుంటూ ఉన్నాడు. ఇక నెటిజన్స్ ఐతే కంగ్రాట్స్ అని చెప్తున్నారు. అలా అలా ... బ్లాక్ బస్టర్ అవ్వాలి , కంగ్రాట్యులేషన్స్ సార్ , కంగ్రాట్స్ అన్నా అని విషెస్ చెప్తున్నారు.
------------------






