Home

»

Tv News

నా 4 నాకు ఫిక్స్... తనూజ, నేను బెస్ట్ పెయిర్ అన్న ఇమ్ము

Aug 5, 2026 5:43PM

స్టార్ మాలో కుకు విత్ జాతిరత్నాలు షో ఎండింగ్ కి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ప్రోమోస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
"కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 గ్రాండ్ ఫినాలే. ఇన్ని వారాలుగా ఒక్క టైటిల్ కోసం జరిగిన కుకింగ్ మహాసంగ్రామం  ఇప్పుడు టాప్ 6 కి చేరుకుంది. ఈ సిక్స్ లో టైటిల్ కొట్టేది ఎవరు ...ఈ గ్రాండ్ ఫినాలే గెలిచేదెవరు ? ఈ ఫినాలే అద్దిరిపోద్ది " అంటూ ప్రదీప్ ఇంట్రో ఇచ్చాడు. "కప్పు కొడతాను అన్న బలమైన నమ్మకమైతే నాకుంది " అంటూ రాకేష్ చెప్పాడు. "కప్పు ఇంటికి పట్టుకెళ్తా " అంటూ డీమన్ పవన్ చెప్పాడు. "కప్పు లేపాలి " అని అంటూ ఆషికా . "గెలవాలని కోరుకునే వాళ్ళు చాల మంది " అంటూ తనూజ చెప్పారు. ఇక ఆలీ సూట్ వేసుకుని వచ్చేసరికి ప్రదీప్ ఆటపట్టించాడు. "పార్టీ అంటే ఈ మాత్రం ఉండాలి కదా " అంటూ ఆన్సర్ ఇచ్చారు అలీ.

తర్వాత హరి వచ్చి "నేను ఎవరిననుకున్నారు పార్టీ ఆర్గనైజర్ ని. రీసెంట్ గా శ్రీదేవి గారి కూతురి బర్త్ డే పార్టీ శ్రీలంకలో నేనే ఆర్గనైజ్ చేసాను చెప్పలేదా నా గురించి  " అన్నాడు. అంటే శ్రీదేవి పరువు తీసేసింది. "మాది బాగా జరిగింది . మీరెక్కడ ఆర్గనైజ్ చేశారు " అంది. ఇక తర్వాత రోహిణి - నిఖిల్ వచ్చారు. "మీకెప్పుడైనా ఈవెంట్స్ కి సింగర్ కావాలంటే చెప్పండి. జస్ట్ ఐదున్నర లక్షల్లో  పూర్తి చేస్తాం " అని రోహిణి చెప్పింది. వెంటనే నిఖిల్ " నాకు 2 తనకు 3 " అన్నాడు. " నో నో ఒకటిన్నర నిఖిల్ కి 4 నాకు. నా 4 నాకు ఫిక్స్ వీడే తగ్గుతూ ఉంటాడు.  " అంది రోహిణి.

తర్వాత ఇమ్ము - తనూజ వచ్చారు. "లాస్ట్ సీజన్ ది మోస్ట్ పెయిర్ మేమిద్దరం. నాకు తెగితే తనకు బ్లడ్ వచ్చేది. తనకు తెగితే నాకు బ్లడ్ వచ్చేది" అని చెప్పాడు ఇమ్ము. "ఈసారి మాకొస్తదా ఏంటి " అంటూ ప్రదీప్ అడిగాడు. దాంతో అందరూ నవ్వేశారు. ఇక నూకరాజు ఐతే తాగుబోతు గెటప్ వేసుకుని వచ్చాడు. మణికంఠ బాడీ గార్డ్ గెటప్ వేసుకొచ్చి పల్చగా ఉన్న తన చేతి కండలు  చూపించాడు. వెంట రాకేష్ "బాడీ గార్డ్ అంటే ఎంత దమ్ముండాలి " అనేసరికి నూకరాజు మత్తు ఇచ్చి పడుకోబెట్టాడు రాకేష్ ని.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com