Home

»

Tv News

Illu Illalu Pillalu Serial: ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీకి ఏర్పాట్లు.. వల్లీని పిలిచిన నర్మద!

Nov 13, 2026 8:17AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-629 లో.... రామరాజు ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్ పనుల్లో నిమగ్నమైపోతారు. విశ్వక్ కూడా వచ్చి చెరో పని చేస్తుంటాడు. ధీరజ్, సాగర్ నేమ్ బోర్డుని పైకి పెడతారు. తర్వాత ప్రేమ ధీరజ్ బోర్డు మీద తన పేరు ఎలా రాశాడో చూడాలని వెళ్లి తెగ ప్రయత్నిస్తుంది.ఇంతలో ధీరజ్ తో పాటు అందరూ వస్తారు.ఏంటే ఇది అని ధీరజ్ అడుగుతాడు. నా పేరు ఎలా రాశావో చూస్తున్నానని ప్రేమ అంటుంది.  అంటే నీకు నచ్చేలా రాశానులే అని ధీరజ్ అంటాడు. రేయ్ మీ అమ్మ ఫీలవుతుందిరా అని అంటే నేను చూసుకుంటాలే అని ధీరజ్ అంటాడు. ఆ మాటతో ధీరజ్ తన పేరే రాశాడని ప్రేమ ఫిక్స్ అయిపోయి సందడి చేస్తుంది. నేను కూడా బిజినెస్ ఓపెన్ చేస్తా, నువ్వే రిబ్బన్ కట్ చేయాలి, నువ్వు రిబ్బన్ కట్ చేస్తా అంటేనే బిజినెస్ పెడతానని అమూల్యతో విశ్వ అంటాడు.

ప్రేమ, నర్మదలు అందరికీ జ్యూస్ లు ఇస్తారు. కామాక్షి చూసి ఏంటమ్మా ప్రేమ నువ్వు పని చేస్తున్నావ్.. నువ్వు ఓనరమ్మవి మేం పని చేస్తాంలే అంటుంది. దానికి ధీరజ్ నువ్వు ఎందుకు అక్క పని చేయడం, అది చేస్తుందిలే అని అంటాడు. ప్రేమ ఉడికిపోయి నువ్వు రారా ఇంటికి మాడ్చుతా అంటుంది. ఇక కామాక్షి నేను పని చేస్తారా.. అప్పుడే నీకు గుర్తుంటుంది, రేపు నాకు మీ బావకి కారులో తిప్పుతావ్, కారు కొనిస్తావ్, అయినా నాన్న దగ్గర 30 లక్షలు తీసుకున్నావ్ అంట అని అంటుంది. దానికి ధీరజ్ ఈ వార్త నీకు వచ్చేసిందా, అయితే ఓ 15 లక్షలు అప్పు నీకు ఇస్తాలే అంటాడు. వద్దురా బాబు అని కామాక్షి అంటుంది.

మరోవైపు వల్లీకి నర్మద కాల్ చేయాలని అనుకుంటుంది. ఇక భాగ్యం రౌడీలకు కాల్ చేసి రెడీగా ఉండండి.. నేను మేడం వస్తున్నాం.. పని పూర్తి అయిపోవాలని అంటుంది. వల్లీకి నర్మద కాల్ చేసి ఏం చేస్తున్నావ్ అక్కా అంటే, చందు బావని చూడాలని ఉందని వల్లీ అంటే చూడాలి అంటే అక్కడే ఉండటం కాదు, వెంటనే ఇక్కడికి వచ్చేయ్, ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేస్తున్నాడు, అందరం ఇక్కడే ఉన్నాం వచ్చేయ్ అని అంటుంది. వద్దు చెల్లాయ్ తిడతారని వల్లీ అంటే ఏం కాదు నేను చూసుకుంటా తిడితే తిట్టని వాళ్ల బాధపోతుంది, ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు త్వరగా వచ్చేయ్ అని అంటుంది. సరే అని వల్లీ సంతోషంగా రెడీ అవుతుంది. ఇంట్లో చందు నిద్రలో లేచి అంజలి అని అరుస్తాడు. రామరాజు, వేదవతి పరుగున వెళ్తారు. రాత్రి తండ్రిని అన్న మాటలు గుర్తు చేసుకుని చందు తండ్రిని పట్టుకుని ఏడుస్తూ క్షమించమని అడుగుతాడు. మరోవైపు భాగ్యం, భద్రావతి, సేనాపతిలు రౌడీలను కలిసి ఆ ధీరజ్ అనుకున్నది జరగకూడదని ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com