Home

»

Tv News

Illu Illalu Pillalu: అందరి కాళ్లు పట్టుకున్న వల్లి.. చందు నిర్ణయం మార్చుకుంటాడా!

Nov 5, 2026 9:03AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -622 లో.....వల్లీకి విడాకులు ఇస్తానని చందు నిర్ణయం తీసుకోవడంతో పెద్ద గొడవ మొదలవుతుంది. ఈ విషయం తెలిసి రామరాజు కొడుకుని నిలదీస్తే నేనే నిర్ణయించుకున్నా విడాకులు ఇచ్చేస్తానని చందు అనడంతో వల్లీ షాక్ అయి కళ్లు తిరిగి పడిపోతుంది. భాగ్యం ఏడుస్తూ చూశారా మేం పేదవాళ్లమని నా కూతురిని వదిలేస్తున్నారని అందరి ముందు గొడవ చేస్తుంది. కాసేపటికి లేచిన వల్లీ.. మామయ్య నన్ను క్షమించండి.. మా అమ్మ మాటలు పట్టించుకోవద్దని బతిమాలుతుంది. రావడం ఇష్టం లేకపోతే దూరంగా ఉంటాను..మీ ఇంట్లో ఓ మూలన పడుంటా విడాకులు ఇప్పించొద్దని అందరి కాళ్లు పట్టుకుంటుంది.

వల్లీ తన భర్తను కూడా పనిమనిషిగా అయినా ఉంటాను నన్ను వదిలేయొద్దని బతిమాలుతుంది కానీ చందు మాత్రం.. నీ అంతు చూస్తానని చెప్పి వెళ్లిపోతాడు. భాగ్యం అందరికీ కొంగు పట్టి నా కూతురి జీవితం కాపాడండని అడుగుతుంది. అక్కడున్నవాళ్లు వేదవతి నీ కూతురు చేసిన తప్పుని వాళ్ల అత్త ఎలా తట్టుకోగలదని ప్రశ్నిస్తారు. వల్లీ నర్మద, ప్రేమల కాళ్లు పట్టుకొని మీకంటే పెద్దదాన్ని చెప్పండని బతిమాలినా ఏం చేయలేమని వాళ్లు అంటారు. ధీరజ్ తో నువ్వు చెప్తే అన్నయ్య వింటాడని బతిమాలితే.. వదిన నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్లు, నువ్వు మారిన మాట నిజమైతే దేవుడే అన్నయ్య మనసు మారుస్తాడని అందరిని ధీరజ్ తీసుకెళ్లిపోతాడు.

 

వల్లీ ఏడుస్తుంటే ఆనందరావు ఓదారుస్తాడు. బావ నమ్మడం లేదు నాన్న అని వల్లీ ఏడుస్తుంది. తను మారడం వల్ల వాళ్లు వచ్చి తీసుకెళ్తారనుకున్నానని చెప్తుంది. భాగ్యం మాత్రం వాళ్లని ముప్పుతిప్పలు పెట్టి నీ కాళ్ల దగ్గరకు వచ్చేలా చేస్తానని అంటుంది. వల్లీ మాత్రం అత్తామామల మీద నమ్మకం ఉందని, బావ వచ్చి తీసుకెళ్తాడని అంటుంది. ఇంట్లో రామరాజు పంచాయితీ పెడతాడు. నీ పెద్ద కొడుకు చేసిన పని వల్లే భాగ్యం నా కాలర్ పట్టుకుందని రామరాజు అంటాడు. పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్పాలని లేదా అని నిలదీస్తే చెప్తే మనసు మార్చేస్తారని చెప్పలేదని చందు అంటాడు. ఇది నా జీవితం, నా నిర్ణయం నేను తీసుకున్నానని చందు తెగేసి చెప్తాడు.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com