స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -545 లో.....మంచితనం ముసుగులో మా ఇంటికి వచ్చి గొడవచేసి నా కోడలిని మీ ఇంటికి తీసుకొని వెళ్ళారు.. కానీ చుడండి తప్పకుండా నా కోడలు నా ఇంటికి వస్తుందని భద్రవతితో వేదవతి చెప్తుంది. ఆ తర్వాత రేపు గుడికి వెళ్లి అమ్మవారికి చీర సమర్పించాలని భద్రవతి అంటుంది. వద్దు అక్క అక్కడికి ఆ రామరాజు కుటుంబం వస్తుంది. ఆ ధీరజ్ గాడు నాపై చెయ్ చేసుకున్నాడు.. అవమానిస్తాడని సేనాపతి అంటాడు.
పాపం ప్రేమ ఆ ధీరజ్ చేసిన మోసం ఇంకా మర్చిపోలేకపోతుంది తనని డైవర్ట్ చెయ్యడానికి వెళ్ళాలని భద్రవతి అంటుంది. నేను రాను అత్తయ్య నాకు స్పెషల్ క్లాస్ ఉందని ప్రేమ అంటుంది. ఆ తర్వాత రామరాజు వచ్చి అమూల్యని పిలిచి రేపు అమ్మవారికి చీర పెట్టాలి కదా తీసుకొని వచ్చానని ఇస్తాడు. అమూల్యకి చైన్ ఇస్తాడు. ఇది మీ అమ్మ కి ఇవ్వు అంటాడు. మీరు ఇస్తేనే తీసుకుంటా అని వేదవతి అంటుంది. అది జరగదని రామరాజు అంటాడు. వల్లికి ఒక చైన్ ఇస్తాడు.. నర్మదకి కూడా ఒక చైన్ ఇస్తాడు.. ఏంటి వాళ్ళ వస్తువులు మనకి ఎందుకు అని సాగర్ అంటాడు. ముందు తాకట్టు పెట్టిన బంగారం తీసుకొని రమ్మని చెప్పమని రామరాజు అంటాడు. ప్రేమ కోసం తెచ్చిన చైన్ ధీరజ్ కి ఇచ్చి రేపు గుడికి వస్తారు అక్కడ ఇవ్వమని చెప్తాడు.
ఆ తర్వాత వేదవతి బాధపడుతుంటే ధీరజ్, నర్మద వెళ్లి రేపు ప్రేమకి అర్థం అయ్యేటట్టు చెప్దాం వాళ్ళు కావాలనే గొడవ పెట్టుకున్నారని చెప్తే ప్రేమ అర్థం చేసుకొని మన ఇంటికి వస్తుందని నర్మద అంటుంది. ఆ మాటలు వల్లి విని రేపు వీళ్ళు ప్రేమతో మాట్లాడకుండా చెయ్యాలని అనుకుంటుంది. ఆ తర్వాత అమూల్యకి విశ్వ ఫోన్ చేసి మనం ప్రేమ ధీరజ్ ని ఒకటి చెయ్యాలి అనుకున్నాం కదా.. రేపు మా చెల్లి గుడికి రావట్లేదని విశ్వ చెప్తాడు. నువ్వు ఏం చేస్తావో తెలియదు.. మా వదిన రేపు గుడికి రావాలని అమూల్య చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరుసటిరోజు భద్రవతి, సేనాపతి గుడికి రెడీ అవుతారు. ప్రేమ ఇని స్టిట్యూట్ కి రెడీ అవుతుంది. విశ్వ గుమ్మం ముందు అటు ఇటు తిరుగుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




