Home

»

Tv News

Illu illalu pillalu : భద్రవతి ఎంట్రీతో మారిన ఇంట్లోని వాతావరణం.. కేక్ కటింగ్ వద్ద హైఓల్టేజ్ డ్రామా!

Jul 25, 2026 10:08AM

 స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -532 లో.. వేదవతి తన అక్క భద్రవతి వచ్చిందని చాలా సంతోషంగా ఉంటుంది. అక్క ఇది తిను అది తిను అంటూ చాలా హడావిడి చేస్తుంది. ఆ తర్వాత అందరు హాల్లో కూర్చొని ఉంటారు. పెద్దమ్మ ఈ నగలు బాగున్నాయని కామాక్షి అనగానే హేయ్ ఊరుకోవే అని వేదవతి అంటుంది. నీకోసం కూడా బంగారు గాజులు తీసుకొని వచ్చానని ప్రేమ, కామాక్షిలతో భద్రవతి అంటుంది. కామాక్షికి భద్రవతి బంగారు గాజులు ఇస్తుంది. దాంతో కామాక్షి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

అమూల్య నీకోసం కూడా గాజులు తీసుకొని వచ్చానని భద్రవతి ఇస్తుంటే అమూల్య వాళ్ళ నాన్న వంక చూస్తుంది. తను తీసుకొమని చెప్పగానే అమూల్య తీసుకుంటుంది. ఆ తర్వాత అమూల్య గదిలోకి వెళ్లి ఆ గాజులు చూస్తూ ఎమోషనల్ అవుతుంది. పెద్దమ్మ నాకు ఇచ్చినా ఫస్ట్ గిఫ్ట్ జాగ్రత్తగా కాపాడుకోవాలని అమూల్య అద్దం ముందు కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అద్దం పై ఒక పేపర్ మీద ఆ గాజులు నేనే కొన్నాను బాగున్నాయా అని విశ్వ రాసినట్టుగా ఉంటుంది. . అప్పుడే విశ్వ వస్తాడు. అప్పుడే అమూల్యని ఎవరో పిలిస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మరొకవైపు సుకన్యని తిరుపతి వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొమని చెప్తాడు. ఆ తర్వాత కేక్ కటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. పెద్దావిడ కేక్ కట్ చేయబోతుంటే అమ్మ ఆగమని చెప్పి ఇంకొక కేక్ తెప్పిస్తాడు. వాళ్ళ కేక్ వాళ్ళకి అని సేనాపతి అంటుంటే ఎందుకు ఏమైనా కలిపావా అని ధీరజ్ అంటాడు. రేయ్ ధీరజ్ ఎందుకు అలా అంటావని ప్రేమ అంటుంది. అందులో ఏం కలపలేదని నిరూపించడం కోసం భద్రవతి కేక్ తింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com