డ్యాన్స్ నేర్పిస్తున్న ప్రేమని చూసేసిన ధీరజ్.. శ్రీవల్లికి తెలిసిందిగా!
on Jun 15, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -185 లో...... ప్రేమ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంది. అదంతా నర్మద పక్కనే ఉండి చూస్తుంది. అప్పుడే ధీరజ్ ఫుడ్ డెలివరీ కోసం అక్కడికి వస్తాడు. వెంటనే ధీరజ్ వచ్చిన విషయాన్ని ప్రేమకి చెప్తుంది నర్మద. దాంతో నర్మద ఒకవైపు, ప్రేమ ఒకవైపు దాక్కుంటారు. హలో ఎవరు లేరా ఫుడ్ ఆర్డర్ పెట్టారని ధీరజ్ పిలుస్తాడు. ఇంట్లో ఎవరు లేరు.. మీరు వెళ్లిపోండి అని ప్రేమ గొంతు మార్చి మాట్లాడుతుంది.
ఫుడ్ తీసుకొని డబ్బు ఇవ్వండి అని ధీరజ్ అంటాడు. అవసరం లేదని ప్రేమ డోర్ వెనకాల నుండి చెప్తుంది. నేను పరాయి పురుషుడిని చూడనని ప్రేమ అంటుంది. అప్పుడే ప్రేమని ధీరజ్ అద్దంలో నుండి చూసి.. నా భార్య అలాంటిది ఇలాంటిది అంటూ లేనిపోనివి కల్పించి ప్రేమని ఇండైరెక్ట్ గా తిడతాడు. దాంతో ఏం అన్నావ్ రా అంటూ ప్రేమ బయటకు వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని ప్రేమని ధీరజ్ అడుగుతాడు. మావయ్య ట్యూషన్ చెప్పొద్దన్నాడు కదా అందుకే డ్యాన్స్ నేర్పుతున్నానని ప్రేమ అంటుంది. బుద్ధి ఉందా నాన్నకి తెలిస్తే బాగోదంటూ ధీరజ్ కోప్పడతాడు.
ధీరజ్ వెళ్ళిపోయాక ప్రేమ దగ్గరికి నర్మద వస్తుంది. ధీరజ్ కి ఎలా చెప్పాలోనని అనుకున్నా కానీ తెలిసిపోయింది. ధీరజ్ అయితే ఒకే కానీ ఆ శ్రీవల్లి చూస్తేనే ప్రాబ్లమ్ అని నర్మద, ప్రేమ అనుకుంటారు. అప్పుడే శ్రీవల్లి అటుగా వెళ్తూ ప్రేమ, నర్మదలని చూస్తుంది. మావయ్యకి తెలియకుండా ఇదంతా చేస్తున్నారా అని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



