Home

»

Tv News

Illu Illalu Pillalu: వల్లిని తిట్టిన చందు.. రౌడీలని చితకబాదిన రామరాజు కుటుంబం!

Nov 15, 2026 9:24AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -631 లో.. వల్లీని ఎందుకు పిలిచారని చందు ధీరజ్ మీద కేకలేస్తాడు. నేను తనకి విడాకులు ఇస్తున్నానని తెలీదా అని అంటే నేను నీకు విడాకులు ఇవ్వను బా అని వల్లీ అంటుంది. చందు కోపంగా ఇక్కడ నేను ఉండాలా తను ఉండాలా తేల్చుకో.. తను ఉంటే నేను ఉండనని అంటాడు. దానికి వల్లీ నేనే వెళ్లిపోతా బా, ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్ అంటే అందరితో పాటు నేను ఉండాలనుకున్నా, ఆ అర్హత కూడా నాకు లేదని అర్థమైందని వెళ్లిపోతుంటే వేదవతి ఆపుతుంది. రామరాజు చందుని తిడుతూ ఆడపిల్ల కన్నీరు పెట్టుకుంటే మంచిది కాదురా అని చెప్తాడు.

ధీరజ్, ప్రేమలు సంతోషంతో పిలిచారురా.. మనం బాధ పెట్టడం ఎందుకని చందుకి రామరాజు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. దానికి చందు సరే మీ అందరికీ తనే ముఖ్యం, నేను వెళ్లిపోతానని బయటకు వెళ్తాడు. ఇక వల్లీ, నర్మద, ప్రేమలు దీపం వెలిగిస్తారు. ధీరజ్, ప్రేమలు పూజ చేస్తుంటారు. ఇంతలో నర్మద చందు దగ్గరకు వెళ్లి బావగారు వల్లీ అక్క చాలా తప్పులు చేసింది కాదనడం లేదు.. ఇప్పుడు తను మారింది, ఒక్క అవకాశం ఇద్దాం బావగారు, విడాకులు వద్దని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి చందు ఎవరైనా వల్లీని మళ్లీ నా జీవితంలోకి తేవాలనుకుంటే వాళ్లు నాకు శత్రువులే అంటాడు.. ఆ మాటలు వల్లీ వింటుంది.

ఆ తర్వాత ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్ దగ్గరకు భద్రావతి పంపిన రౌడీలు వస్తారు. మా పర్మిషన్ లేకుండా ఎవర్రా ఓపెనింగ్ చేసింది..‌నెలకి లక్ష మామూలు ఇవ్వాలి, 50 వేలు ఫైన్ కట్టాలి అంటూ గొడవ చేస్తారు. తిరుపతిని నెట్టేస్తారు. ప్రేమ చెల్లి లాంటి దాన్ని 5 వేలు తీసుకుని వెళ్లిపోండి అని బతిమాలితే రౌడీలు డబ్బుని ప్రేమ ముఖాన కొడతారు. దీంతో ధీరజ్, చందు, సాగర్, విశ్వ, రామరాజు, వేద, నర్మద, ప్రేమలు అందరూ కలిసి రౌడీలను చితక్కొడతారు. రౌడీలు పారిపోతారు. ఆ తర్వాత చందు మాత్రం ఈ దరిద్ర దేవత వల్లే ఇదంతా అంటూ వల్లీని బయటకు గెంటేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Illu Illalu Pillalu, Telugu TV Serial, Star Maa, Aamani, Prabhakar]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com