Illu illalu pillalu : రామరాజుని కొట్టిన విశ్వ.. ఆ పెళ్ళి జరుగుతుందా!
on Mar 19, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -109 లో... రామరాజు గురించి భద్రవతి చెప్పిన విషయాలన్నీ భాగ్యం తన గుప్పిట్లో పెట్టుకొని రామరాజు దగ్గరికి వెళ్లి మీరు ఇలాంటి వారంట.. మీతో సంబంధం కలుపుకోవడానికి మాకు కాస్త ఇబ్బందిగా ఉంది. ఆడపిల్లని మీ ఇంటికి పంపించాలంటే భయంగా ఉందని రామరాజు తో భాగ్యం అంటుంది. మా పెద్దోడు చాలా మంచివాడు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడని రామరాజు చెప్తుంటాడు. అయిన వినకుండా చూస్తామంటూ భాగ్యం వెళ్ళిపోతుంది.
మరొక వైపు వేదవతి తన కాబోయే పెద్ద కోడలు కోసం చీరలు సెలక్ట్ చేస్తుంటుంది నర్మద, వేదవతి, ప్రేమ ముగ్గురు శ్రీవల్లికి చీరలు సెలక్ట్ చేస్తుంటారు. చందుని పిలిచి శ్రీవల్లికి ఈ చీరలు ఫోటో తీసి ఎలా ఉన్నాయో అడుగమనగానే.. శ్రీవల్లికి చందు ఫొటోస్ పంపిస్తాడు. తల్లి పక్కన లేకపోవడంతో ఏం చెప్పాలో తెలియక శ్రీవల్లి సైలెంట్ గా ఉంటుంది. ప్రేమ.. నువ్వు చీరలు తీసుకోమని వేదవతి అనగానే వద్దని చెప్పి ప్రేమ వెళ్ళిపోతుంది. రామరాజు బాధపడుతూ చీకట్లో ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటాడు.
మరొకవైపు భాగ్యం వాళ్లు ఇంటికి వెళ్తారు. ఆయన చీరల ఫోటో పంపించాడు. ఏం చెప్పాలో తెలియక రిప్లై ఇవ్వలేదని శ్రీవల్లి అంటుంది. ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని శ్రీవల్లి నాన్న జరిగింది మొత్తం శ్రీవల్లికి చెప్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు రామరాజు మనం చెప్పినట్టు వింటాడు.. పెళ్లి ఎంగేజ్మెంట్ అంత వాళ్ల చేతులు మీదుగానే జరిపించేలా చేస్తానని భాగ్యం అంటుంది. ధీరజ్ బయటనుండి భోజనం తీసుకొని వస్తాడు. దాంతో వేదవతి బాధపడుతుంది. తరువాయి భాగంలో ప్రేమని విశ్వ నెట్టేస్తాడు. ఎందుకు అలా చేస్తున్నావని రామరాజు అడుగుతాడు. ప్రేమని విశ్వ కొడుతుంటే ఆ దెబ్బ రామరాజు చెంపకి తగులుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
