అమ్మాయిలకు మసాజ్ చేస్తున్న ఆది... షాకైన వర్షా!
on Feb 16, 2026

శ్రీదేవి డ్రామా కంపెనీ షో 5 వ వార్షికోత్సవ సెలెబ్రేషన్స్ జరుపుకోబోతోంది. నెక్స్ట్ వీక్ ఈ సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. రష్మీ వచ్చి ఆదితో "ఈరోజు ఏంటి గుర్తుందా" అని అడిగింది. "ఒకడు నీ లైఫ్ లోంచి వెళ్ళిపోయి ఇంకొకడు నీ లైఫ్ లోకి వచ్చిన రోజు" అంటూ చెప్పేసరికి. "గుద్దుతా" అంటూ వార్నింగ్ ఇచ్చింది రష్మీ. ఆది ఇటు రష్మీకి అటు ఇంద్రజ మధ్య సెలబ్రేషన్ కేక్ కటింగ్ విషయంలో పుల్లలు పెట్టేసాడు. తర్వాత ఆది ఈ షోకి యాంకరింగ్ చేసాడు. రష్మీ, ఇంద్రజ చూస్తూ ఎంజాయ్ చేశారు. తర్వాత రష్మీ "ఉత్తమ రొమాంటిక్ జోడి గోస్ టు" అంటూ విక్రమ్ - శ్రీవాణి అని చెప్పింది రష్మీ. చాల స్టైలిష్ గా చెప్పేసరికి "ఏంటి ఈమె పూజ హెగ్డే అనుకుంటుందా" అంటూ ఆది సెటైర్ వేసాడు.

"షోలు ఏమీ లేకపోతే మన వాళ్ళు ఏఏ ప్రొఫెషన్స్ లో ఉంటారో చూదాం" అన్నాడు ఆది. డాన్సర్ పండు వచ్చాడు. బొచ్చె పట్టుకుని బిచ్చమెత్తుకుంటూ "ఈ సాల చిల్లర నమదే" అంటూ ఉన్న పిక్ ని చూపించేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత వర్ష పిన్నీసులు, బుడగలు అమ్ముతూ కనిపించింది. "వర్ష ఏంట్రా ఇంత నేచురల్ గా ఉంది నీ ఫోటో" అన్నాడు ఆది. గత ఎపిసోడ్ లో వర్ష అది రోల్ లో నటించిన క్లిప్పింగ్ చూపించేసరికి వర్షా షాకై నోరెళ్లబెట్టింది. ఇక ఆది ఒక అమ్మాయి ని మసాజ్ చేస్తున్న ఫోటో చూపించాడు. "జీతం తక్కువ ఉంటుంది నాన్న కానీ నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాల ఇష్టం నాన్న" అంటూ హృదయవిదారకంగా చెప్పాడు.
తర్వాత అక్సా ఖాన్ వచ్చి "వేర్ ఈజ్ ది పార్టీ" అనే సాంగ్ కి డాన్స్ చేసింది. "ఉత్తమ అందాల భామ" అని ఆది అనౌన్స్ చేసేసరికి రష్మీ, ఫైమా, వర్ష వచ్చి నిలబడ్డారు. "అసలు మామూలు స్ట్రెస్ లేదు ఇక్కడ" అంది రష్మీ. "ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ఉన్న అందం కూడా పోతుంది" అంటూ ఆది కౌంటర్ ఇచ్చాడు. తర్వాత సుహాసిని వచ్చి అందాల భామ అవార్డు తీసుకోబోతోంది ఫైమా అంటూ అనౌన్స్ చేసింది. "మా అమ్మ నన్ను కాదు అందాన్ని కూడా కన్నది" అని చెప్పింది. "మాములుగా కనేటప్పుడు పెయిన్ ఫీలవుతారు. కన్నందుకు కూడా పెయిన్ ఫీలయ్యారు" అని కౌంటర్ ఇచ్చాడు ఆది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



