Home

»

Tv News

Godhavari : భర్త కోసం నిలబడిన నందు.. సింహాద్రి ఆట కట్టించేందుకు రంగంలోకి సూర్య!

Aug 12, 2026 11:07AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  గోదావరి Godhavari . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్  80 లో...... నా భర్తని ఎందుకు అరెస్ట్ చేశారు తనకి నేనున్నాను.. ఈ నందు వుంది అని నందు అంటుంటే మురారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు ఏదైనా ఉంటే కోర్ట్ లో చూసుకోండి అని ఇన్‌స్పెక్టర్ వాళ్ళని బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. తప్పు చేసిన ఆ కళ్యాణ్ గాడిని వదిలేసి మా బావని ఎందుకు అరెస్ట్ చేస్తారు..  ఇప్పుడే ఆ సింహాద్రి సంగతి చెప్తానని జాను వెళ్తుంటే సూర్య ఆపుతాడు.

ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చెయ్యకూడదు.. కోపంతో మా మావయ్య ఏమైనా చేస్తాడని సూర్య అంటాడు. అవునని నందు అంటుంది. మీరు ఇంటికి వెళ్ళండి.. నేను లాయర్ తో మాట్లాడుతానని సూర్య అంటాడు. మరొకవైపు ఇంట్లో శారద వాళ్ళు బాధపడతారు. అప్పుడే జానూ, నందు వస్తారు. బావ రావడానికి కొంచెం టైం పడుతుంది మీరు ముందు భోజనం చెయ్యండి అని జానూ చెప్తుంది.మరొక వైపు నందు నన్ను భర్తగా ఒప్పుకుందని మురళి చాలా హ్యాపీగా ఫిల్ అవుతాడు. పెళ్లైన కొత్తలో ఇలాగే ఉంటుందని సెల్లో ఉన్న వేరే అతను అంటాడు.

ఏది ఏమైనా నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నానని మురళి అంటాడు. మరొకవైపు సింహాద్రి ఒక్కడే డ్రింక్ చేస్తూ.. జాను నువ్వు నా ముందు ఎంత.. నన్నే ఎదురిస్తావా అని అనుకుంటాడు. అప్పుడే సూర్య వస్తాడు. రా కాబోయే అల్లుడా అని తన భుజం మీద చెయ్ వేస్తాడు. నేనే నిన్ను పిలుద్దామని అనుకున్నాను.. నిత్య బర్త్ డే చాలా గ్రాండ్ గా చేద్దామని అనుకుంటున్నానని సింహాద్రి అంటాడు. ముందు చెయ్ తియ్ నువ్వు అనుకుంటేనో మా ఆమ్మ అనుకుంటేనో నీకు అల్లుడిని కాను.. నేను అనుకోవాలి.. నాకు ఇష్టం ఉండాలని సూర్య అంటాడు. కళ్యాణ్ గాడు తప్పు చేసాడు.. అది పక్కన పెట్టి మురళిని అరెస్ట్ చేయిస్తావా అని కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com