Home

»

Tv News

Godhavari : సూర్యకు షాకిచ్చిన కుటుంబ సభ్యులు.. జాను సంచలన నిర్ణయం!

Aug 4, 2026 9:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -73 లో....భువన అన్న మాటలు గుర్తుచేసుకొని ఇంట్లో వాళ్లంతా బాధపడతారు. అప్పుడే సూర్య లోపలికి వస్తుంటే ఆగు బాబు అని శారద ఆపుతుంది. ఇందాకే మీ అమ్మ వచ్చి వెళ్ళిందని శారద అంటుంది. అది తెలిసే వచ్చానని సూర్య అంటాడ.  మీ అమ్మ మాటలు మేం తట్టుకోలేకపోయాం బాబు.. ఇక మా ఇంటికి రావద్దని శారద చెప్పగానే సూర్య షాక్ అవుతాడు. అవును సూర్య మీ అమ్మ మా కుటుంబం గురించి మా చెల్లి గురించి చాలా తప్పుగా మాట్లాడింది. నువ్వు నా చెల్లితో స్నేహం చెయ్యకని నందు చెప్తుంది. బావ తనతో మాట్లాడి ఇంకొకసారి ఇంట్లో రాకుండా చూడమని మురళికి నందు చెప్తుంది. పదా బ్రో అని సూర్యని మురళి తీసుకొని వెళ్తాడు. ప్రేమ గురించి నీకు తెలియంది కాదు మురళి.. నేను ఎంతగా జానూని ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా అని సూర్య అంటాడు. మీ అమ్మ కత్తితో కోసినట్లు మాట్లాడి వెళ్ళింది బ్రో.. ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని మురళి అంటాడు. ఆప్పుడే జాను వస్తుంది. తను రాగానే మురళి లోపలికి వెళ్తాడు. మీ అమ్మ కి నేనంటే ఇష్టం లేదు అనుకున్నా కానీ డబ్బు లేని వాళ్లంటేనే ఇష్టం లేదు.. అంత చిన్నచూపు.. ఎక్కడ మీ ఆస్తులన్నీ లాక్కుంటానోనని మీ అమ్మ భయం. కానీ నేను ప్రేమించింది ఆస్తులు చూసి అందం చూసి కాదు సూర్య.. ఒక చిన్న స్వార్థం.. ఈ ఊళ్ళోనే ఉంటే మా వాళ్లకి దగ్గరగా ఉంటాననే చిన్న స్వార్థం. కానీ మీ అమ్మ ఆల్రెడీ నీకు పెళ్లి ఫిక్స్ చేసింది.. మీ మావయ్య కూతురితో అని జాను అనగానే అది వాళ్ళ నిర్ణయం నాది కాదని సూర్య అంటాడు. మా అమ్మని ఒప్పిస్తానని సూర్య అంటాడు. జాను గేట్ వేసి లోపలికి వెళ్ళిపోతుంది‌. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. జానూని నందు తీసుకొని వస్తుంది. అసలు మీ మధ్య ఉంది ఏంటని నందు అడుగుతుంది. ఏం ఉంటే ఏంటి అబ్బాయి నాకు నచ్చాడని పెద్దావిడ అంటుంది. నాక్కూడా అని గౌతమి  , కిన్నెరా అంటారు. ఏం చెయ్యాలో జానూకి బాగా తెలుసు అని మురళి అనగానే ఇంట్లో వాళ్ళకి కూడా అందరి గురించి మాట్లాడే అర్హత ఉంది బావ అని జాను అంటుంది. నేను కుటుంబం కోసం తీసుకున్న బాధ్యతలు మర్వలేను.. నేను కుటుంబం కోసం  ఎంతటి త్యాగం అయినా చేస్తాను కానీ భువనకి టైమ్ వచ్చినప్పుడు బుద్ది చెప్తానని జాను అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com