Home

»

Tv News

Godhavari : నందు జడలో మురళి మల్లెపూలు.. జాను చేతికి దొరకనున్న ఆ సాక్ష్యం ఏంటి?

Jul 23, 2026 10:56AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -63 లో......శాంతి వస్తుందని మురళి షాప్ లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటాడు. శాంతి వచ్చి నా కొడుకు ఎక్కడ అని తన అసిస్టెంట్ ని అడుగుతుంది. లేడు అని అతను చెప్తాడు. లోపలున్న నందు.. ఏంటి బావ డోర్ వేసావని అడుగుతుంది. మా అమ్మ వచ్చింది అని మురళి అనగానే అయితే నాకేంటి భయమని డోర్ తియ్యబోతుంటే అప్పుడే తన చెయ్ పట్టుకొని మురళి లాగుతాడు. దాంతో మురళి ఒళ్ళో పడుతుంది నందు. అప్పుడే శాంతి డోర్ తీస్తుంది. వాళ్ళని అలా చూసి అప్పడే నా కొడుకుని నీ వైపుకి తిప్పుకున్నావా అని శాంతి కోప్పడుతుంది.

ఇలాంటి అందగాడు నాకు దొరకడు అని అంటున్నావా నువ్వు ఉహించుకున్నట్లు ఏం జరగదని నందు అంటుంది. మరొకవైపు కళ్యాణ్ కి గౌతమి ఫోన్ చేసి సారీ చెప్తుంది. నీకు కళ్యాణ్ అనేవాడు లేడు.. అంతమంది ముందు కొట్టి ఇప్పుడు సారీ చెప్తున్నావా ఎంతమంది ముందు కొట్టావో అంతమంది ముందు ముద్దు పెట్టాలని కళ్యాణ్ అనగానే ఫోన్ లో పెడతానని గౌతమి అంటుంది. అవసరం లేదని కళ్యాణ్ కట్ చేస్తాడు. అప్పుడే గౌతమి దగ్గరికి జాను వస్తుంది. ఎవరు ఫోన్ లో అని గౌతమిని జాను అడుగుతుంది. మా ఫ్రెండ్ అని గౌతమి చెప్తుంది. ఆ తర్వాత జాను నీరసంగా ఇంటికి వస్తుంది. తనని చూసి కాఫీ ఇవ్వు అమ్మ అని నందు అంటుంది. నేనంటే అక్కకి ప్రేమ ఉందని జాను అనుకుంటుంది. ఆ తర్వాత శంకర్ బ్యాగ్ నుంచి కిన్నెర డైరీ తీసుకొని వస్తుంది. అందులో అందరి గురించి ఉంటుంది. ఒక్క కిన్నెర గురించి ఉండదు. నాన్నకి నేనంటే ఇష్టం లేదని ఫీల్ అవుతుంటే అందరు తనని నవ్వించేలా చేస్తారు. ఆ తర్వాత బ్యాగ్ నుంచి ఇంకొక డైరీ తీసి ఇందులో నాన్న నా గురించి రాసాడేమో చదివాక వాళ్ళకి చెప్తానని కిన్నెర ఆ డైరీని తన స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుంటుంది.

ఆ తర్వాత నందు కోసం మురళి మల్లెపూలు తీసుకొని వస్తాడు. అందరు కలిసి నందుని గట్టిగా పట్టుకుంటారు. నందు జడలో మురళి మల్లెపూలు పెడతాడు. అవి నందు తియ్యబోతుంటే నా మీద ఒట్టే అని పెద్దావిడ అనగానే నందు ఆగుతుంది. తరువాయి భాగంలో శంకర్ బ్యాగ్ లో ఉన్న డైరీని జానూ తీసి చదువుతుంది. మరొకవైపు జానుకి నా గురించి ఏమైనా సాక్ష్యం దొరికిందా అని సింహాద్రి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com