Home

»

Tv News

Godhavari : జాను ప్రేమకు సూర్య ప్రపోజల్.. భువనకు తెలిసిన నిజంతో రంజుగా మారుతున్న కథ!

Aug 2, 2026 10:34AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -72 లో.....జానూని తీసుకొని సూర్య బయటకు వెళ్తాడు. అక్కడ బెలూన్ తో డెకరేషన్ చేసి ఉంటుంది. జాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని సూర్య తన మనసులో మాట చెప్తాడు. ప్రేమ చాలావరకు పెళ్లి వరకు వెళ్ళదని జాను అంటుంది. మనం పెళ్లి చేసుకుందామని సూర్య అనగానే జాను హ్యాపీగా ఫీల్ అయి సూర్య ప్రేమని అంగీకరిస్తుంది కానీ ఇప్పుడే కాదు మీ అమ్మకి మా ఫ్యామిలీ అంటే చిన్నచూపు ఉంది అందుకే నువ్వే మీ అమ్మని ఒప్పించు.. ఇంక తోట ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని జాను చెప్పగానే సరే అని సూర్య అంటాడు.

ఆ తర్వాత సూర్య తెచ్చిన రింగ్ ని చైన్ కి పెడుతుంది జాను. ఇది నీ దగ్గరే ఉండాలి అంటుంది. ఐ లవ్ యు జాను అని సూర్య అనగానే జాను తనని హగ్ చేసుకుంటుంది. అదంతా ఎవరో వీడియో తెస్తారు తీరా చూస్తే జానుని సూర్య ప్రపోజ్ చేస్తున్న వీడియోని భువనకి సింహాద్రి చూపిస్తాడు. అది చూసి ఏంటి అన్నయ్య వీడు ఇలా మారిపోయాడని షాక్ అవుతుంది. నువ్వు అలా అంటే పిల్లని ఇచ్చే తండ్రిని నాకెలా ఉంటుందని సింహాద్రి అంటాడు. సూర్య రానివ్వు వాడి సంగతి చెప్తానని భువన అనగానే వాడిని ఏం అనకు ఆ జానుకి బుద్ది చెప్పమని సింహాద్రి అంటాడు.

మరొకవైపు జాను తన ప్రేమ ఒప్పుకుందని సూర్య డాన్స్ చేస్తాడు. అప్పుడే తుఫాన్ వస్తాడు. తుఫాన్ కి విషయం చెప్పగానే పార్టీ కావాలని అతను అంటాడు. అప్పుడే సూర్యకి ఫోన్ వస్తే పక్కకి వెళ్తాడు. మరొకవైపు జాను ఇంటికి భువన వెళ్తుంది. ఇలాగేనా పిల్లలని పెంచేదని కోప్పడుతుంది. నీ కూతురు నాకు కొడుకు వెంటపడుతుంది అని భువన అనగానే నీ కొడుకే నాకు చెల్లి వెంట పడుతున్నాడని నందు అంటుంది. ఇంకొకసారి నా కొడుకు వెంట పడొద్దని భువన వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com