Home

»

Tv News

f2: ఎఫ్ 2 మూవీకి ఇన్స్పిరేషన్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి మూవీ

May 30, 2026 2:51PM

డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ లో హార్దిక్ - రోహిత జోడి ఐతే ఒక రేంజ్ లో స్కిట్ చేసి జడ్జెస్ ఫిదా ఐపోయేలా చేశారు. వీళ్ళు "క్షేమంగా వెళ్లి లాభంగా రండి " అనే మూవీని స్కిట్ చేసి చూపించారు. ఇక ఈ స్కిట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రోజా, శ్రీకాంత్, అనిల్ రావిపూడి పడీపడీ నవ్వుతూనే ఉన్నారు. ఇక ఫైనల్ గా అనిల్ రావిపూడి ఈ మూవీ గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పారు. "నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. గుంటూరులో చూసాను ఆ ఫిలింని. నా కెరీర్ లో ఒక సినిమాని బాల్కనీ నుంచి నేల వరకు ఒక వేవ్ లాగా జనాలు నవ్వుతూ ఉంటే ఒక సముద్రపు అల ఎలా వెళ్తుందో అలా  జనాలు అలల్లా నవ్వడం చూసాను. నేను షాకైపోయాను. ఆ మూవీని నేను 10 - 12 సార్లు చూసాను. ఎఫ్ 2 మూవీ తీయడానికి మేజర్ రీజన్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి అనే మూవీనే. ఆ మూవీ పెట్టుకుని మొగుడు పెళ్ళాల మధ్య ఒక డ్రామా ఒక సినిమా తీస్తే సేమ్ ఎక్స్పీరియన్స్ కనిపించింది. 

తిరుపతిలో ఒక థియేటర్ లో ఈ మూవీ చూస్తే బాల్కనీ నుంచి నేల వరకు అదే వేవ్. థియేటర్ లో ఆడియన్స్ అలల్లా నవ్వడం నేను చూసాను. నేను డైరెక్ట్ చేసిన ఫిలింకి దీనికి కనెక్షన్ ఉంది. " అని చెప్పారు. ఇక రోజా ఐతే "జూనియర్ రొజాగా అదరగొట్టేశావ్ రోహితా " అని చెప్పారు అలాగే ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. "ఇంటికి వెళ్ళాక ఈ మూవీని చూడండి చాలా బాగుంటుంది. కోవై సరళ గారని ఒక ఆంటీ ఉంటారు బ్రహ్మానందం గారిని కుమ్ముతారు " అని చెప్పారు అనిల్ , రోజా చెప్పారు. "అక్కడ షూటింగ్ లో బ్రహ్మానందం గారిని తరిమితే మా మధ్యలో దూరి దూరి పరిగెడుతూ ఉంటారు. నేను శ్రీకాంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే . ఒకే సింగల్ షాట్ పెట్టారు. శ్రీకాంత్ సర్ నవ్వడం స్టార్ట్ చేస్తే అరగంట ఆపరు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళ అలా దూరి మా మధ్యలో కొడుతూ ఉంటే మాకు టెన్షన్ రావాలి కానీ మేము నవ్వేస్తూ ఉన్నాం. ఆ షూటింగ్ ని వాళ్ళిద్దరి కంబినేషన్ లో ఎంత ఎంజాయ్ చేసామో ' అని చెప్పారు రోజా.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com