ఒరిజినల్ వైఫా.. ఆడపిల్లను నేనెలా చెప్తాను!
on Feb 3, 2026

ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ వీక్ ప్రోమో ఫుల్ కామెడీగా ఉంది. పొదరిల్లు సీరియల్ హీరో-హీరోయిన్ చక్రి, మహాలక్షి రిసెప్షన్ ఎపిసోడ్ గా తీసుకురాబోతున్నారు. ఇంకా కొన్ని జంటలు వచ్చారు.
"పెళ్ళైన జంటలకు ఎలాంటి టిప్ ఇస్తారు" అని శ్రీముఖి నిరుపమ్ - మంజుల పరిటాలని అడిగింది. "మోసం చేసి పెళ్లి చేసుకోకూడదు. అర్జున్ కళ్యాణ్ ఐతే "తమ్ముడు ప్రామిస్ లు గీమిస్సులు చేసి ఇరుక్కోకు" అన్నాడు. "నువ్వేం ప్రామిస్ లు చేసావ్" అంది శ్రీముఖి. "చాలా ఇచ్చాము ప్రామిస్ లు" అన్నాడు. "చాలా ఇచ్చాడు. చాలామందికి ఇచ్చాడు" అంటూ కౌంటర్ వేసాడు నిరుపమ్.
ఇక మహేశ్వరీ ఒక అబ్బాయితో కలిసి వచ్చేసరికి "మీరిద్దరూ అసలు ఎప్పుడు, ఎలా జోడి అయ్యారు ?" అని శ్రీముఖి అడిగింది. "ఆడపిల్లను నేనెలా చెప్తానక్కా" అంది. "ఈ యాక్టింగ్ ఏదో సీరియల్ లో చేసుంటే కొన్ని సిన్మాలన్నా వచ్చేవి" అంది. వెంటనే అర్జున్ కళ్యాణ్ ఒక రెడ్ హార్ట్ బెలూన్ ని శ్రీముఖి మీదకు విసిరాడు. "ఏంటి నువ్వు నాకు లైన్ వేస్తున్నావ్" అంటూ ఆ బెలూన్ ని రివర్స్ లో వేసింది.
తర్వాత షోలోకి అనుదీప్, విశ్వక్ సేన్ వచ్చారు. "మీకసలు చక్రి, మహాలక్ష్మి తెలుసా" అనేసరికి "తెలుసండి చిన్నప్పటి నుంచి పూతరేకులంటే ఫేవరేట్ అసలు" అంటూ చెప్పాడు విశ్వక్ సేన్. "పూతరేకులు కాదండి అది పొదరిల్లు" అంది శ్రీముఖి. "ఫంక్షన్ లో పూతరేకులు పెడితే బాగుంటుంది అని చెప్తున్నా" అంటూ కవర్ చేసుకున్నాడు.
"ఆయన్ని మీరెప్పుడన్నా చూసారా..ఆయన సీరియల్ పేరు ఏదన్న తెలుసా" అంటూ నిరుపమ్ ని చూపిస్తూ అడిగింది శ్రీముఖి. "డాక్టర్ బాబు" అన్నాడు అనుదీప్. "వంటలక్క బాగున్నారా అండి" అంటూ అడిగాడు. "ఎవరు సర్ ఆవిడ" అన్నాడు నిరుపమ్. "ఆమెనే వంటలక్క హాయ్ చెప్పండి" అంటూ మంజుల పరిటాలను చూపించింది. "వైఫ్ నేనే వంటలక్క నేను కాదు" అంది మంజుల. "ఒరిజినల్ వైఫ్ ఆ" అన్నాడు అనుదీప్. దాంతో అందరూ నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



