Home

»

Tv News

Illu illalu pillalu : విశ్వకి ప్లాన్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఏం చేయనున్నాడు!

Mar 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -418 లో.....ప్రేమ తన బర్త్ డే అని పాయసం తీసుకొని వెళ్లి బయటున్న అమూల్యకి ఇస్తుంది. మీ అమ్మ చేసిందని నర్మద, ప్రేమ అనగానే అమూల్య ఎమోషనల్ అవుతుంది. అప్పుడే విశ్వ వచ్చి ఏంటే ఇక్కడ ఉన్నావని కోప్పడతాడు. అమూల్య చెంపచెల్లుమనిపిస్తాడు. అప్పుడే ప్రేమ వచ్చి విశ్వ చెంపచెల్లుమనిపిస్తుంది. దాంతో ప్రేమపై విశ్వ కోప్పడతాడు.

నా భార్యపై చెయ్ లేపుతావా అని ధీరజ్ గొడవకి దిగుతాడు. ప్రేమ, నర్మద ఇద్దరు గొడవ సద్దుమణిగేలా చేస్తారు. ప్రేమ, ధీరజ్ బయటకు వెళ్తారు.ఆ తర్వాత విశ్వని శ్రీవల్లి కలుస్తుంది. మీరు పెళ్లి చేసుకోలేదని నాకు తెలుసు కానీ దానికి కారణం ఎవరో తెలుసుకునే ప్లాన్ చెప్తానని విశ్వకి శ్రీవల్లి ఏదో చెప్తుంది. ప్రేమ, ధీరజ్ ఇద్దరు కలిసి కార్ కొనడానికి డౌన్ పేమెంట్ కోసం కామాక్షి దగ్గరికి వస్తారు. కామాక్షి నిండుగా నగలు వేసుకొని ఉంటుంది. అక్క నాకు డబ్బు కావాలని ధీరజ్ అడుగుతాడు. దాంతో కామాక్షి లోపలికి వెళ్లి నగలు తీసి వచ్చి నాకు డబ్బు ఎక్కడిదిరా అవన్నీ గిల్టీ నగలు.. నా దగ్గర డబ్బు లేదని కామాక్షి యాక్టింగ్ చేస్తుంది. దాంతో ధీరజ్, ప్రేమ డిస్సపాయింట్ అవుతారు.

ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ బయటకి వస్తారు. కామాక్షి కూతురు కలర్ తీసుకొని వచ్చి మావయ్య హోలీ ఆడండి అని అంటుంది. వాళ్లకు ఎదురుగా కావాలనే విశ్వ ఒకమ్మాయిని తీసుకొని వచ్చి నేను చెప్పినట్లు చెయ్ అని తనతో క్లోజ్ గా ఉంటాడు. తరువాయి భాగం లో ప్రేమ, ధీరజ్ హోలీ ఆడతారు. విశ్వతో అమ్మాయి క్లోజ్ గా ఉండడం ప్రేమ, ధీరజ్ చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com