సుధీర్ గారు ఎన్నాళ్ళు సింగల్ గా వుంటారు...
on Jun 4, 2025
ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ హీరోస్ వెర్సెస్ సీరియల్ హీరోయిన్స్ మధ్య పోటీ నిర్వహించాడు సుధీర్. ఈ షోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా ఐతే సుధీర్ ని ఒక రేంజ్ లో ఆడేసుకుంది. ఇప్పటి వరకు ఏ షోలో కూడా సుధీర్ తో అలా కామెడీ చేసిన వాళ్ళు లేరు. "మీ అందాన్ని నేను ఎంత బాగా వర్ణిస్తానో చూడండి. కాజు అంటే డ్రై ఫ్రూట్ సుధీర్ అంటే" అని చెప్పేసరికి సుధీర్ గట్టిగా అరుస్తూ ఆపేయ్ అన్నాడు. సుధీర్ తోనే కాదు రవికిరణ్ తో కూడా కామెడీ చేసింది దీపికా. "నాన్న నేనే టెక్సాస్ లో చదువుకుంటున్న మీ లిటిల్ ప్రిన్సెస్ ని" అనేసరికి రవి కిరణ్ షాకయ్యాడు. ఇక పవిత్ర వచ్చి మంచి సీరియల్ చేసానయ్యా అంటూ "చెడ్డీ చెరో సగం" అని చెప్పేసరికి అవాక్కయ్యాడు సుధీర్. తర్వాత "అబ్బని తియ్యని దెబ్బ" సాంగ్ కి దీపికా సుధీర్ తో కలిసి డాన్స్ చేసింది.
అది కూడా మీద మీద పడుతూ సుధీర్ ని గిల్లుతూ గిచ్చుతూ చేసేసరికి సుధీర్ భయపడిపోయారు. "సుధీర్ గారు వేస్ట్ అండి. మీరు ఇంకా ఎన్ని సంవత్సారు సింగల్ గా ఉంటారు. ఈ ప్రపంచానికి మీరొక ఫాథర్ థెరెసాలా (father theresa ) ఉన్నారు తెలుసా మీకు." అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. చాలా రోజుల తర్వాత వాసంతి కృష్ణన్ ఈ షోలో కనిపించింది. అలాగే బిందెల మీద నిలబెట్టి సాంగ్ కి డాన్స్ వేసే టాస్క్ ఇచ్చారు. ఇక దీపికా ఐతే తన లైఫ్ లో జరిగిన ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పి కొంచెం బాధపెట్టింది. తన లైఫ్ కి తానే హీరో అని చెప్పుకొచ్చింది. తాను ఈ కెరీర్ లో సెటిల్ కావడం ఎవరికీ నచ్చలేదు. కానీ తన కెరీర్ ని తానే డెవలప్ చేసుకుంటోంది కాబట్టి తన కెరీర్ కి తానే హీరో అని చెప్పుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
