Home

»

Tv News

Karthika Deepam2 : సుమిత్ర కూతురు దీపనే.. నిజాన్ని బయటపెట్టి ఎమోషనల్ అయిన జ్యోత్స్న!

Apr 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -643 లో.....కార్తీక్ కోసం కాంచన వెయిట్ చేస్తుంది. ఛీ వీళ్ళు ఇక మారారు.. ఈ రోజు మీ పెళ్లిరోజు ఇంటి దగ్గర ఉండమని చెప్పాను.. అయినా నా మాట వినకుండా ఆశీర్వాదం తీసుకొని వస్తామని వెళ్లారు కానీ ఇంకా ఇంటికి రాలేదని కాంచన అంటుంది. ఇక  దీప అని పిలుస్తుంది.. ఆ తర్వాత  ఏ శౌర్య మీ అమ్మ బయట ఉండి ఉంటుంది పిలువమని  కాంచన అనగానే శౌర్య వెళ్లి బయట చూస్తుంది. అక్కడ దీప ఉండదు. లోపలికి వచ్చి నానమ్మ అమ్మ లేదని శౌర్య చెప్పగానే దీప ఎక్కడికి వెళ్ళిందని కాంచన అనుకుంటుంది.

మరొకవైపు చీకటి అయ్యిపోయింది  .. ఇంత దూరం తీసుకొని వచ్చావని జ్యోత్స్నపై కార్తీక్ కోప్పడతాడు. ఏంటి బావ దీప వెయిట్ చేస్తుందని ఫీల్ అవుతున్నావా అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ సడెన్ గా బ్రేక్ వేసి కార్   ఆపుతాడు. తీరా చూస్తే స్కూటీపై దీప కార్ ముందు ఉంటుంది. తనని చూసి జ్యోత్స్న కార్ దిగుతుంది. ఏం గొడవ అవుతుందోనని కార్తీక్ కూడా  కార్ దిగుతాడు. దీపని రెచ్చగొట్టాలని జ్యోత్స్న అనుకొని  బావ మీకు సర్ ప్రైజ్ ఇస్తాను. తనకి ముద్దుపెట్టడానికి దగ్గరికి  వెళ్తుంది. దాంతో  జ్యోత్స్నని దీప లాగి పెట్టి కొడుతుంది. అందరు  కలిసి ఆఫీస్ కి వెళ్తారు. ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చామని   అనుకుంటున్నావా.. ఎందుకంటే  రోడ్డుపై గొడవ పెట్టుకొని ఇంటి పరువు తియ్యలేనని దీప అంటుంది. నన్ను కావాలనే రెచ్చగొట్టింది బావ అని దీప అంటుంది. జ్యోత్స్న, దీప మధ్య మాటామాటా పెరిగిపోతుంది. ఏంటి సుమిత్ర కన్నకూతురా అని జ్యోత్స్న అనగానే దీప షాక్ అవుతుంది. ఏంటి షాక్ అయ్యావా.. నాకు నిజం ఎప్పుడో తెలుసు.. ఈ విషయం బావకి  పార్టీ రోజే తెలిసిందని జ్యోత్స్న అంటుంది.

ఆ తర్వాత జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. నా సొంతం అనుకున్న బావని పెళ్లి చేసుకున్నావు .. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది..  చిన్నప్పటి నుండి బావని చూపించి ఇతనే నీ మొగుడు అని చెప్పారు. .అలా చెప్పిన దానికి వేరొకరు ఎలా కన్పిస్తారు నాకంటూ ఏముంది.. నువ్వే ఆ ఇంటికి వారసురాలివి అని తెలిస్తే నా పరిస్థితి ఏంటని జ్యోత్స్న తన ఫ్రస్ట్రేషన్ చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com