.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -657 లో.....కార్తీక్ కి పారిజాతం ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ ని స్పీకర్ లో పెట్టి మాట్లాడతాడు. ఒసేయ్ దీప.. ఆ జ్యోత్స్న నీకు నిజంగానే సవతి అయ్యేలా ఉంది. అది జరగకుండా ఉండాలంటే దానికి త్వరగా పెళ్లి చేసి పంపాలని పారు అనగానే సరే అని దీప అంటుంది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు దీపకి చీర కొను.. ఆ చీర కార్తీక్ కి నచ్చిందని చెప్పమని కార్తీక్ అనగానే పారిజాతం సరే అంటుంది.
ఆ తర్వాత జ్యోత్స్న తన ఫ్రెండ్ పాప బర్త్ డే కి వెళ్ళడానికి గిఫ్ట్ కోసమని షాప్ కి వెళ్తుంది. అక్కడ ఒక టెడ్డీ బేర్ తీసుకుంటుంది. అక్కడే ఇంకొక బొమ్మ నచ్చుతుంది. అది కావాలని జ్యోత్స్న ఓనర్ ని అడుగుతుంది. అది ఆల్రెడీ కొన్నారు వాళ్ళని అడగండి.. ఇస్తానని అతను అంటాడు. అప్పుడే ఆ బొమ్మ కొన్న అతను వస్తాడు. నాకు ఆ బొమ్మ కావాలి ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తానని జ్యోత్స్న అంటుంది. నాకు నచ్చింది నేను తీసుకున్నాను.. మీరు డబ్బులు ఇస్తే నేను ఇవ్వడమేంటి.. నేను ఇవ్వనని పొగరుగా మాట్లాడతాడు. దాంతో జ్యోత్స్నకి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జ్యోత్స్న ముందు కావాలనే పారిజాతం చీర తీసుకొని వచ్చి ఇది దీపకి ఆర్డర్ చేసాను.. కార్తీక్ కి నచ్చింది ఈ చీర కట్టుకొని దీప వస్తుంటే కార్తీక్ ఫ్లాట్ అవుతాడని పారిజాతం అంటుంది. దాంతో ఆ చీర జ్యోత్స్న లాక్కొని ఈ చీర నాది అని తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత కార్తీక్, దీప, పారిజాతం ప్లాన్ సక్సెస్ అని మాట్లాడుకుంటారు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. ఏంటి మాట్లాడుకుంటున్నారని అడుగుతాడు. ఏం లేదు తాత జ్యోత్స్నకి ఒక సంబంధం తీసుకొని వచ్చానని కార్తీక్ అంటాడు. అప్పుడే అబ్బాయి ఎంట్రీ ఇస్తాడు. ఇంట్లో అందరిని పరిచయం చేసుకుంటాడు. పారిజాతం, దీప ఇద్దరు జ్యోత్స్న దగ్గరికి వెళ్తారు. వెళ్లేసరికి కార్తీక్ కి నచ్చిన చీర అని జ్యోత్స్న కట్టుకొని మురిసిపోతుంది. ఇది నా చీర.. ఎందుకు కట్టుకున్నావని దీప రెచ్చగొడుతుంది. ఇప్పుడు వెళ్లి బావ ఎలా ఉన్నానని అడుగుతానని జ్యోత్స్న కిందకి వెళ్తుంది. ప్లాన్ సక్సెస్ అని దీప, పారు అనుకుంటారు. ఆ తర్వాత జ్యోత్స్న కిందకి వెళ్తుంది. మేడమ్ కరెక్ట్ టైమ్ కి వచ్చింది.. అబ్బాయి కూడా వచ్చాడని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
