ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam2 : జ్యోత్స్న పని చెప్తానన్న పారిజాతం.. దీప ఏడుపు!

on Feb 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -593 లో... జ్యోత్స్న తన ప్రాణాలు కాపాడుతుందని సుమిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్ మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తానని శ్రీధర్ అంటాడు. మీరు దీపని తీసుకొని వెళ్ళండి బావ.. కార్తీక్ తో నాకు పనుంది అని దశరథ్ అంటాడు.

దీపని తీసుకొని శ్రీధర్ బయల్దేరాతాడు. డాడీ బావని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడోనని జ్యోత్స్న అనుకుంటుంది. నేను ఇప్పుడు దాస్ దగ్గరకు వెళ్ళాలని జ్యోత్స్న వెళ్తుంటే తనని ఫాలో అవుతూ పారిజాతం వెళ్తుంది. ఆ తర్వాత దాస్ దగ్గరికి రౌడీలు భోజనం తీసుకొని వస్తారు. దాంతో మీరు కూడా తినండిరా అని దాస్ అనగానే మాకు కొంచెం పని ఉందని‌ వాళ్ళు అంటారు. అయితే నాకు కూడా మందు పోయండి రా అని దాస్ అంటాడు.‌ ఇక దాస్ కూడా తాగుతున్నట్టుగా వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళని మాటల్లో పెట్టి వాళ్ళు ఫుల్ గా తాగి పడిపోతాయాలా చేస్తాడు దాస్. ఆ తర్వాత అక్కడ నుండి తప్పించుకుంటాడు దాస్. మరొకవైపు కార్తీక్ ని తీసుకొని దశరథ్ హాస్పిటల్ కి వస్తాడు. ఎందుకు మావయ్య ఇక్కడికి తీసుకొని వచ్చావని అని కార్తీక్ అడుగుతాడు. నాకు జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయంటే డౌట్ గా ఉందని దశరథ్ అంటాడు. డాక్టర్ హారిక దగ్గరికి వెళ్లి దశరథ్ మాట్లాడుతాడు. మీరు ఎవరికైనా భయపడి సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పారా అని అడుగుతుంది. అదేం లేదని డాక్టర్ చెప్తుంది. ఎక్కడ నిజం చెప్తుందోనని కార్తీక్ టెన్షన్ పడుతాడు కానీ డాక్టర్ నిజం చెప్పకుండా కవర్  చేస్తుంది.

మరొకవైపు జ్యోత్స్న వెళ్లేసరికి దాస్ ఉండడు. దాంతో రౌడీలపై జ్యోత్స్న కోప్పడుతుంది. తనని ఫాలో అవుతూ వచ్చిన పారిజాతం చాటు నుండి తనని చూస్తుంది. ఆమ్మో ఆ కార్తీక్ గాడు అన్నట్లు.. ఇదే నా కొడుకుని కిడ్నాప్ చేసింది.మ అమ్మ నా సుమిత్ర కూతురా ఇన్నిరోజులు నువ్వు నా మనవరాలు అనుకొని హెల్ప్ చేసాను.. ఇక మీదట నీ సంగతి చెప్తానని పారిజాతం అంటుంది. మరొకవైపు రేవతి, శ్రీధర్, దీప మాట్లాడుకుంటారు. రేపు ప్రొద్దున గుడికి వెళ్ళాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగుండాలని పూజ చేపిస్తున్నానని కాంచన అనగానే దీప అసలు విషయం చెప్పలేక ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.