నా వయసు 30... పూరి గారంటే నాకు పంచ ప్రాణాలు
on Jun 7, 2025
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకున్న పృద్వి రాజ్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఒక చిట్ చాట్ షోలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. "నాకు జీవితాన్ని ఇచ్చింది తల్లితండ్రులైతే సినీ జీవితాన్ని ఇచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు. స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకుని వారితో బొట్టు పెట్టించుకున్నా. వారి గెటప్స్ తో ఉన్న పుస్తకం ఒకటి ఇచ్చి లాంగ్ లివ్ అన్నారు. ఇక రాజమౌళి గారి కోసం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.
రాజమౌళి గారి మూవీలో ఒక ఫ్రేమ్ అన్నా నిలబడడం చాలు అనుకున్నప్పుడు బాహుబలి 2 లో ఒక మంత్రిగా చేయడం మంచి విషయం. నాకు ఇక్కడ ఎవరూ పోటీ కాదు. యంగ్ లో నాలాగే ఉన్నావ్ అంటూ కైకాల సత్యనారాయణ గారు అనేవారు. ఆయనే పోటీ. మా కామెడీ కులంలో కుల పెద్ద బ్రహ్మానందం గారు. మేమంతా చిలకలపూడి రోల్డ్ గోల్డ్ బంగారం ఐతే ఆయన ఒరిజినల్ బంగారం. 30 ఇండస్ట్రీ డైలాగ్ టైంలో నా వయసు 30 కూడా కాదు. పూరి జగన్నాధ్ కూడా మొదట నటుడే. రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ దగ్గర గులాబీ మూవీ చేసే టైంలో వీళ్లంతా అక్కడే గోడల మీదా కూర్చునేవారు. నేను ఆయన ఫస్ట్ మూవీ బద్రిలో చేశా. అది ఎడిటింగ్ ప్రాబ్లమ్ వలన కట్ ఐపోయింది. ఆ మాట నా జీవితంలో ఆస్కార్ అవార్డు రావడం లాంటిది. సెంటిమెంట్ అనే విషయానికి వస్తే ముందు పూరి జగన్నాధ్ నన్ను పెట్టుకునే వారు. పోకిరిలో ఫస్ట్ షాట్ నాదే. పూరి గారంటే నాకు పంచ ప్రాణాలు" అని చెప్పుకొచ్చారు పృద్వి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
