అనసూయను ముద్దు అడిగిన చలాకి చంటి!
on Jul 5, 2022
ఒకరి తర్వాత తర్వాత జబర్దస్త్ షోని వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళను చూస్తుంటే షో పరిస్థితి ఏమిటా అనే ఆలోచన ఆడియన్స్ కి వచ్చింది. ఐతే ఇప్పుడు ఈ షో మాత్రం కొంచెం కొంచెం గాడిన పడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే చలాకీ చంటి టీం, రాకెట్ రాఘవ టీం ఈ షోకి ఇప్పుడు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. ఇక ఇప్పుడు ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో చలాకి చంటి చిన్నపిల్లాడి వేషంలో వచ్చి ఈ స్కిట్ పెర్ఫార్మ్ చేసాడు. కొమరం ఛాతికి తల్లి పాత్రలో కనిపిస్తుంది.
"అమ్మా నన్ను ఎత్తుకోమని ఆ ఆంటీకి చెప్పవా" అంటూ అనసూయ వైపు చూపిస్తాడు. "నీ పిల్లలనైతే ఎత్తుకుని తిరుగుతావు.. నా పిలగాడికి ఎత్తుకోవడానికి ఏమైందమ్మా, అందంగా లేడా నా పిలగాడు" అంటూ నిష్ఠూరంపోతుంది కొమరం. "గాడిదలా పెరిగాడు చూడు" అంటూ కౌంటర్ ఇస్తుంది అనసూయ. "ఒక ముద్దు పెట్టమని చెప్పవా అంటీని" అని మళ్ళీ అడుగుతాడు చలాకీ చంటి. "ఇలాగేనా నీ కొడుకుని పెంచేది" అంటూ అనసూయ సీరియస్ అయ్యేసరికి కొమరం.. చంటిని కొట్టి "స్కిట్ నీ కోసం రాసుకున్నావా, ఆ పిల్ల కోసం రాసుకున్నావా" అంటూ గడ్డి పెడుతుంది.
ఇక లాస్ట్ లో రాఘవ, ఆయన కొడుకు మురారి కలిసి "అదుర్స్" మూవీలోని బ్రహ్మానందం కామెడీ బిట్ ఆధారంగా వేసిన స్కిట్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అలాగే వెంకీ మంకీస్ వేసిన దశావతారం స్కిట్ కూడా మంచి టైమింగ్ ఉన్న కామెడీని అందించింది. ఇలా ఈ వారం జబర్దస్త్ షోలో స్కిట్స్ అన్నీ కూడా ఆడియన్స్ ని అలరించబోతున్నాయి.