Podharillu : ఇల్లు కోసం వెతుకుతున్న మహా.. మాధవ సాయం చేస్తాడా!
on Feb 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -50 లో..... మహాపై కోప్పడినందుకు కేశవ గిల్టీగా ఫీల్ అవుతాడు. ఎందుకు డల్ గా ఉన్నావని అతని కింద పనిచేసే అతను అడుగగా జరిగింది చెప్తాడు. నువ్వు మీ వదినకి ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళు అని సలహా ఇస్తాడు. మరొకవైపు మాధవ మేస్త్రి పనికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అయన పెద్ద ఆర్కిటెక్ కదా అంత సింపుల్ గా వెళ్తున్నాడని చక్రిని మహా అడుగుతుంది. మా అన్నయ్యకి
అలా సింపుల్ గా ఉండడం అంటే ఇష్టం.
ఎక్కడికి వెళ్తాడో అలా రెడీ అయి వెళ్తాడు. అదే కదా బిజినెస్ లో స్టేటజీ అంటారని మహా అంటుంది. నేను జాబ్ కి వెళ్తున్నానని చక్రి వెళ్తాడు. నారాయణ దగ్గరికి మహా వచ్చి పోలీసులు మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా అని అడుగుతుంది. నలుగురు కొడుకులు ఉన్నా ఎవరు అడగలేదు.. నిన్న కాక మొన్న వచ్చిన కోడలు అడిగిందని నారాయణ అంటాడు. మరొకవైపు చక్రి తన ఓనర్ దగ్గరికి వెళ్తాడు. నిన్ను డ్రైవింగ్ జాబ్ లో నుండి తీసేసానని అతను అనగానే ప్లీజ్ సర్ ఇప్పుడు జాబ్ లేకపోతే కష్టం అని రిక్వెస్ట్ చేస్తాడు. డ్రైవర్ గా పంపించినందుకు వెళ్లి వాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకొని వచ్చావ్.. వాళ్ళు నా మీదకి గొడవ కి వచ్చారని కోప్పడతాడు.
మరొకవైపు వదిన ఆకలిగా ఉంది తిందామని మహాతో కన్నా అంటాడు. అప్పుడే కేశవ వస్తాడు. ఒరేయ్ కన్నా ఆకలిగా ఉంది అంటాడు. పదా అన్నయ్య ముగ్గురం తిందాం.. వదిన కూడా ఉందని కన్నా అంటాడు. ఎందుకు వెళ్లిపోయాడని మహా అడుగగా.. ప్రొద్దున మీరు నీళ్ళు పోసినందనుకు తను కోప్పడ్డాడు కదా మీరు ఏమైనా అంటారేమోనని భయపడి వెళ్ళిపోయాడని కన్నా అంటాడు. ఇంకా ఎన్నిరోజులు ఇలా ఉంటాడని మహా అడుగగా.. కొంచెం టైమ్ పడుతుందని కన్నా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



