Podharillu : మాధవకి నిజం చెప్పేసిన మహా.. షాక్ లో చక్రి!
on Feb 4, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -42 లో..... మహా, చక్రి ఇద్దరు ఊళ్ళోకి ఎంట్రీ అవ్వగానే వాళ్ళకి సంబంధించిన రిసెప్షన్ ఫ్లెక్సీ చూస్తారు. అక్కడ ఫ్లెక్సీ చూసి మహా, చక్రి షాక్ అవుతారు. ఏంటి మీ వాళ్లు నన్ను మీకు పర్మినెంట్ వైఫ్ గా చేద్దామని ఫిక్స్ అయినట్లు ఉన్నారని మహా కోప్పడుతుంది. ఇంటికి రాగానే చక్రి కోపంగా.. ఏంటి అన్నయ్య ఇది అని అడుగుతాడు. ఒరేయ్ వాళ్లకేం చెప్పలేదా అని మాధవ అనగానే కన్నా సర్ ప్రైజ్ అన్నాడు అందుకే ఏం చెప్పలేదని కేశవ అంటాడు.
చక్రి, మహా ఇద్దరు లోపలికి వెళ్తారు. మహా గదిలోకి వెళ్తుంది. నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా.. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు.. ఇప్పుడు ఇలా ఇదంతా చేస్తే ఎలా ఉంటుందని చక్రి అంటాడు. నువ్వు మాకు చెప్పే పెళ్లి చేసుకున్నావా ఏంటని కేశవ అంటాడు. చక్రి, కేశవ మధ్య గొడవ జరుగుతుంది. ఒకరి చొక్కా ఒకరు పట్టుకొని గొడవపడుతుంటే మహా వస్తుంది. తనని చూసి ఇద్దరు ఆగిపోతారు. కన్నా బయటకు వచ్చి ఏడుస్తుంటే కేశవ వస్తాడు. వదిన మనల్ని చూసి ఏమనుకుంటుంది. ఎందుకు అలా గొడవపడుతున్నారని కన్నా అనగానే అన్నయ్యతో అలా మాట్లాడేసరికి కోపం వచ్చిందని కన్నాతో కేశవ అంటాడు. మరొకవైపు తాయారు వాళ్ళ అన్నయ్యని తీసుకొని రిసెప్షన్ కి రెడి అవుతుంది. మనం వెళ్ళేది రిసెప్షన్ చూడడానికి కాదు రిసెప్షన్ ఎలా ఆగుతుందో చూడడానికి అని తాయారు వాళ్ళ అన్నతో అంటుంది. మీరు వెళ్ళండి నేను వస్తానని గాయత్రి అనుకుంటుంది.
ఆ తర్వాత రిసెప్షన్ కి అందరు వస్తారు. అమ్మాయికి నచ్చజెప్పి తీసుకొని రమ్మని చక్రితో మహా అంటాడు. మహా దగ్గరికి చక్రి వచ్చి మాట్లాడతాడు. నా గోల్ ఇది కాదు.. ప్లీజ్ మీ వాళ్ళని భ్రమ నుండి బయటకు రమ్మని చెప్పండి అని మహా అంటుంది. తరువాయి భాగంలో మాధవకి మహా నిజం చెప్తుంది. మేం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని చెప్పగానే మాధవ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



