Home

»

Tv News

'అన్ స్టాపబుల్' మూడో ఎపిసోడ్.. బాలయ్య-బ్రహ్మి కలిస్తే రచ్చ రచ్చే!

Dec 1, 2021 12:14PM

ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో నటసింహం నందమూరి బాలకృష్ణ అలరిస్తోన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, నాని గెస్ట్ లుగా వచ్చిన మొదటి రెండు ఎపిసోడ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బాలకృష్ణ చేతికి సర్జరీ జరిగి, మూడో ఎపిసోడ్ మూడు వారాలు గ్యాప్ రావడంతో.. గెస్ట్ ఎవరు? ఎపిసోడ్ ఎప్పుడొస్తుంది? అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచుతున్నారు. అయితే తాజాగా ఆహా మూడో ఎపిసోడ్ గురించి క్లారిటీ ఇచ్ఛేసింది.

రీసెంట్ గా ఆహా ఒక వీడియోను విడుదల చేసింది. అందులో 'వారం వారం రావడానికి నేను సీరియల్ ని కాదు.. సెలబ్రేషన్ ని' అంటూ బాలకృష్ణ మరింత ఎనర్జీతో కనిపించారు. దీంతో ప్రేక్షకుల్లో అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ పై ఆసక్తి రెట్టింపు అయ్యింది. అయితే తాజాగా మూడో ఎపిసోడ్ గెస్ట్, టెలికాస్ట్ వివారాలను ఆహా ప్రకటించింది. మూడో ఎపిసోడ్ గెస్ట్ లుగా కామెడీ కింగ్ బ్రహ్మానందం, 'ఫన్'టాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి  వస్తున్నారని తెలిపింది. అలాగే ఈ ఎపిసోడ్ ఈనెల 3 నుంచి స్ట్రీమింగ్ కానుందని పేర్కొంది.

'అన్ స్టాపబుల్' షోలో బాలకృష్ణ ఫుల్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో కలిసి ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com