Home

»

Tv News

Brahmamudi : మనసులో మాట దాచుకున్న వెంకీ.. ఐశ్వర్య వల్ల ఇందూకు కొత్త చిక్కులు!

Aug 12, 2026 10:33AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్  1108 లో....ఐశ్వర్య పార్టీకి వెళ్లిందని స్వాతి టెన్షన్ పడుతుంటే ఐశ్వర్యను కాపాడే బాధ్యత తనదే అని ఇందు స్వాతికి ధైర్యం చెప్తుంది. ఇంకోవైపు వెంకీ ఫోన్ రాగానే నందు గాల్లో తేలుతుంది. బిజీ కదా, డిస్టబ్ చేస్తున్నానా అని నందు సెటైర్లు వేయగా, వెంకీ సారీ చెప్పి రేపు ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని కలవమంటాడు. లవ్ గురించి చెప్తాడేమో అని నందు సంబరపడి ఓకే అంటుంది. కానీ ఇంట్లో లక్ష్మీ అడిగితే వెంకీ.. నాన్న కోసం నా ప్రేమను త్యాగం చేస్తా. నందు అంటే ప్రాణం, కానీ నాన్న కంటే ఎవరూ గొప్ప కాదు అని ఫిక్స్ అయిపోతాడు.

లక్కీ ఒంటరిగా మందు కొడుతూ పెళ్లి చూపుల వల్ల పరువుపోయిందని రాజుపై కోపంగా ఉంటాడు. రాజు.. నీ అమ్మని నిన్ను కలిపే బాధ్యత నాది. మందు మీద ఒట్టు అని ధైర్యం చెప్తాడు. అదే టైంలో ఐశ్వర్య తన ఫోన్ లోని జీపీఎస్ ట్రాకర్ ఆఫ్ చేసి ఇందుని టెన్షన్ పెడుతుంది. సాయం కోసం ఇందు రాజుకి ఫోన్ చేస్తే, ఎప్పుడూ నీ సమస్యలేనా అని రాజు ఫోన్ పెట్టేస్తాడు.

  ఐశ్వర్య ప్రమాదంలో ఉందని ఇందు నందుని సాయం అడుగుతుంది. మొదట నందు అది నీ మాట వినదు, బుద్ధి రావాలని అంటుంది. కానీ తర్వాత మన వాళ్లను గాలికి వదిలేయమని ఇందు సీరియస్ గా అడిగేసరికి నందు ఒప్పుకుంటుంది. శశి కోసమే ఐశ్వర్య వెళ్లిందని అనుమానించి, ఇద్దరికి కామన్ ఫ్రెండ్ రీనూ పేరు సోషల్ మీడియాలో వెతుకుతారు. రీనూ అడ్రస్ స్వాతి చెప్పడంతో నందు, ఇందు కలిసి ఐశ్వర్యను కాపాడడానికి బయలుదేరతారు. స్వాతిని ఇంట్లోనే ఉండమని ఇందు చెప్తుంది.మరొకవైపు శశి కి ఐషు రింగ్ గిఫ్ట్ ఇస్తుంది. అది చూసి చాలా బాగుందని శశి అంటాడు తరువాయి భాగంలో శశి ఫ్రెండ్ ద్వారా ఐశ్వర్య గురించి ఇందు, నందు తెలుసుకుంటారు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com