Home

»

Tv News

Brahmamudi : రాజు సంపాదనపై చలపతి గర్వం.. ఐశ్వర్య సంచలన డిమాండ్‌తో రచ్చ!

Aug 19, 2026 9:43AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  బ్రహ్మముడి  Brahmamudi . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్  1114 లో.. చలపతి తన కొడుకు రాజు నెలకు ఐదు లక్షలు నిజాయితీగా సంపాదించాడని తెలుసుకుని ఎంతో గర్వపడతాడు. మీరెప్పుడైనా లక్ష రూపాయలు చూశారా? నా కొడుకు నెలకు ఐదు లక్షలు తీసుకొచ్చాడు. నా పెంపకం గురించి, నా కొడుకు గురించి ఎన్ని మాటలు అన్నారు.. ఇప్పుడు ఏం అంటారంటూ అందరి ముందు గొప్పగా చెప్తాడు. రాజు మాత్రం.. నాన్న ఇంతలా సంతోషిస్తాడని అనుకోలేదు. ఇదంతా నీ వల్లే ఇందు.. థాంక్స్ అని అంటాడు. మరోవైపు రేఖ ఐశ్వర్యను రెచ్చగొడుతూ, రాజుకు ఐదు లక్షలు ఇచ్చారని చెప్తుంది. నువ్వు ఈ ఇంటి వారసురాలివి.. నీకూ ఇందులో వాటా ఉంది. అడిగే హక్కు నీకుందని ఐశ్వర్యతో రేఖ అంటుంది. ఈ మాటలు శేషు, భ్రమరం వింటారు. తమను దూరం చేస్తున్నారేమోనని వాళ్లు అనుమానపడతారు. 

 

ఇంట్లో అందరు కలిసి భోజనం చేస్తూ సంతోషంగా ఉండగా చలపతి ఇందును మెచ్చుకుంటాడు. వాడు ఇంతలా మారిపోయి, నిజాయితీగా బతుకుతున్నాడంటే ఇదంతా నీ వల్లే అమ్మా. మొదట నిన్ను చూసినప్పుడే నువ్వు మా వాడి జీవితంలోకి వస్తే బాగుంటుందని అనుకున్నా. ఇప్పుడు వాడ్ని నీ చేతిలో పెడుతున్నాం.. నువ్వే చూసుకోవాలని చలపతి అంటాడు. ఇందు మాత్రం.. నేనేం చేశాను అంకుల్ అని ఇందు అంటుంది. తర్వాత రాజు, ఇందు కలిసి సుభాష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. డాక్టర్ పరీక్షించి.. చాలా రోజులు కదలకుండా కూర్చోవడం వల్ల కాళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది. కానీ నరాలు పూర్తిగా దెబ్బతినలేదు. ఆపరేషన్, ట్రీట్‌మెంట్, ఫిజియోథెరపీ చేస్తే మళ్లీ నడిచే అవకాశం ఉంది. అయితే ఎంతకాలంలో నార్మల్ అవుతారో చెప్పలేమని చెప్తాడు. ఇందు వెంటనే ట్రీట్‌మెంట్ చేయిద్దాం డాక్టర్ అని అంటుంది. ఈ విషయం తెలుసుకున్న శేషు కూడా సంతోషిస్తాడు. 

 

అందరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఐశ్వర్య మొదలుపెడుతుంది. నాకు ఐదు లక్షలు ఇవ్వు అని ఇందును ఐశ్చర్య అడుగుతుంది. అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మొన్నే కారు తాకట్టు పెట్టి మూడు లక్షలు ఇచ్చాం.. ఇప్పుడు అంత డబ్బు ఎందుకు అని అపర్ణ అడుగుతుంది. కానీ ఐశ్వర్య సమాధానం చెప్పకుండా.. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని అంటుంది. అంతేకాదు రాజుకు ఐదు లక్షలు ఎందుకు ఇచ్చావని ఇందును నిలదీస్తూ.. రాజుకి ఐదు లక్షలు ఎందుకు ఇచ్చావు? నీకు అద్దె మొగుడిగా నటిస్తున్నందుకా అని ప్రశ్నిస్తుంది. శేషు మాత్రం.. వాళ్లిద్దరూ నిజమైన భార్యాభర్తలే అమ్మా  అని చెప్తాడు. అయినా ఐశ్వర్య పట్టించుకోకుండా..అదంతా నాకు అనవసరం.. నాకు ఐదు లక్షలు ఇవ్వు అంటూ డిమాండ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com