Home

»

Tv News

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ కి బ్యాడ్ టైమ్.. కొత్త సీరియల్  తెచ్చిన సమస్య!

Nov 10, 2024 12:16PM

తెలుగు ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఇక కొంతకాలం క్రితం సూపర్ హిట్ అయిన 'గుప్పెడంత మనసు' సీరియల్ ముగిసింది. దాంతో ఆ సీరియల్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఇప్పుడేమో 'బ్రహ్మముడి' సీరియల్ ని మధ్యాహ్నం టైమ్ స్లాట్ లో ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా డైరెక్ట్ టీవీలోనే చూపించేస్తోంది.

స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్ 'బ్రహ్మముడి'ని పక్కనపెట్టి, అదే టైమ్ లో రాత్రి 7.30 గంటలకు సరికొత్త సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) అనే సీరియల్‌ని ప్రసారం చేయబోతున్నారు. నవంబర్ 12 నుంచి ఈ సీరియల్ ప్రారంభం కాబోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, ఆమనిలు జంటగా ఈ సీరియల్‌లో నటించారు. ఇక బ్రహ్మముడి సీరియల్‌ని రాత్రి 7.30 నుంచి మధ్యాహ్నం 1 గంటకు మార్చేశారు. దీంతో బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రైమ్ టైమ్ లో చూసే ఆడియన్స్ మధ్యాహ్నం చూడరు. అందరికి వీలు అవ్వదు. దాంతో బ్రహ్మముడి టీఆర్పీ భారీగా తగ్గే అవకాశం ఉంది. మరి కొత్త సీరియల్ రేటింగ్ ఎలా ఉంటుందో‌ చూడాలి మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com