Brahmamudi: రాజ్ సంతకమా? డెత్ సర్టిఫికేటా.. కావ్యని ఇరికించిన రుద్రాణి!
on Apr 24, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-703లో.. రుద్రాణి ఒకతనికి కాల్ చేస్తుంది. నవ్య జ్యూయెలరీ మేనేజర్ శ్రీధర్ గారేనా మాట్లాడేదని అంటుంది. నేనే మేడమ్.. బాగున్నారా.. మీ నంబర్ నా దగ్గర ఉందని శ్రీధర్ అంటాడు. మీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశాను.. మీరు నాలుగు కోట్ల వరకు మా కంపెనీకి చెల్లించాలని విన్నాను నిజమేనా అని రుద్రాణి అనగానే.. నిజమే మేడమ్.. మాకు రావాల్సిన పేమెంట్స్ రాక మేము 2 డేస్ టైమ్ అడుగుతున్నాం కానీ ఆ మేడమ్ అందుకు ఒప్పుకోవడం లేదు.. మాకు 2 డేస్ టైమ్ ఇప్పించగలరా అని అంటాడు. నేను చెప్పినట్లు చేస్తే రెండు రోజులు కాదు రెండు వారాలు టైమ్ దొరుకుతుంది.. మీతో డీల్ మొదలుపెట్టింది రాజ్ కాబట్టి తను లేనప్పుడు పవర్ ఆఫ్ పటార్నీ ఉన్న వాళ్లే డీల్ క్లోజ్ చేయాలి కదా.. రాజ్ లేడన్న డెత్ సర్టిఫికెట్‌ని కావాలని లేదంటే రాజే సంతకం చేసి డీల్ క్లోజ్ చేయాలని కండీషన్ పెట్టండి సరిపోతుందని రుద్రాణి అంటుంది. అదేంటి మేడమ్.. రాజ్ సర్ చనిపోయారు కదా పాపం.. మరి పవర్ ఆఫ్ పటార్నీ కావ్య మేడమ్ గారికి లేదా అని శ్రీధర్ అంటాడు. కావ్యకు పవర్ ఆఫ్ పటార్నీ లేదు.. అందుకే చెబుతున్నా.. ఈ కండీషన్ పెడితే మీకు టైమ్ దొరుకుతుంది. వస్తే రాజ్ వచ్చి సంతకం చెయ్యాలి. అది జరగదు కాబట్టి డెత్ సర్టిఫికెట్ తెప్పించాలి.. దానికి ఎలాగో టైమ్ పడుతుందని రుద్రాణి చెప్తుంది. సరే, థాంక్యూ మేడమ్.. మంచి సలహా ఇచ్చారని శ్రూధర్ అంటాడు అవతల వ్యక్తి. మామ్ కంపెనీకి డబ్బులు రాకుండా ఆపావు ఓకే.. కానీ ఇప్పుడు మన కంపెనీ నుంచి డబ్బు ఇవ్వాల్సిన వారికి సమాచారం ఇవ్వాలి కదా అని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఇప్పుడు అదే చేయబోతున్నా అని రుద్రాణి అంటూ.. స్వరాజ్ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వారికి కాల్ చేస్తుంది.
మీకు 24 గంటల్లో 2 కోట్లు ఇస్తానని మా కావ్య చెప్పిందట కదా.. కానీ అది జరిగేలా లేదు.. రాజ్ చనిపోయాడు కాబట్టి డెత్ సర్టిఫికెట్ ఇవ్వనిదే పేమెంట్స్ వసూలు కావడం లేదట అని రుద్రాణి అంటుంది. మరి కావ్య మేడమ్ మాకు ఎందుకు అలా చెప్పారు.. 24 గంటల్లోనే ఇస్తామని అతను అంటాడు. నన్ను అడిగితే నేనేం చెప్పాలి. అదే విషయం ఇంటికి వచ్చి కావ్యను నిలదీయండి అని రుద్రాణి అనగానే.. వస్తాం మేడమ్.. ఇంటికి వచ్చే నిలదీస్తాం.. మీ ఫ్యామిలీకి ఉన్న పేరు వల్ల అలా ఆగాం కానీ మమ్మల్ని మోసం చేస్తే ఊరుకుంటామా అని అతను అంటాడు. దాంతో ఫోన్ పెట్టేస్తుంది రుద్రాణీ. వెంటనే కొడుకు రాహుల్‌తో .. ఇప్పుడు చూస్తాను కావ్య ఏం చేస్తుందో.. ఏది ఏమైనా రాజ్‌ని తీసుకుని రావాలి. ఒకవేళ తీసుకుని రాలేకపోతే.. వాడు చచ్చాడని డెత్ సర్టిఫికెట్ అయిన తీసుకునిరావాలని రుద్రాణి అంటుంది. ఇక మరునాడు కావ్యకు నవ్య జ్యూయెలరీ మేనేజర్ కాల్ చేసి.. మాతో డీల్ చేసుకున్న రాజ్ గారి డెత్ సర్టిఫికెట్ తెస్తేనే మేము డబ్బు ఇవ్వగలమని చెప్తాడు. మరోవైపు కావ్య ఆఫీస్‌కి బయలుదేరే సమయానికి.. రా మెటీరియల్ అమ్మే వాళ్లు.. మరో వ్యక్తిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. మా డబ్బు మాకు ఇప్పుడే కట్టండి అని వాళ్లు అంటారు.. కావాలనే.. వాళ్ల తరపున తను మాట్లాడటం మొదలుపెడుతుంది. వాళ్లు కోరినట్లు డబ్బు మనం ఇవ్వాలంటే రాజ్ రావాలి.. లేదా రాజ్ డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చి చూపించాలి. అప్పుడే మనకు రావాల్సిన బిల్స్ వసూలు అవుతాయి. అప్పుడే మనం తీర్చాల్సిన అప్పులు తీర్చగలం.. అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడి కావ్యను ఇబ్బంది పెడుతుంది. ఆఖరి అవకాశంగా ఈ ఒక్కరోజు ఇస్తున్నామని కావ్యకు చెప్పి వాళ్లు వెళ్లిపోతారు.
డెత్ సర్టిఫికెట్ పేపర్ కావ్య ముందు పెట్టి.. ఇందులో ఒక్క సంతకం చెయ్ కావ్యా.. రాజ్ లేడని క్లారిటీ వస్తే సమస్యలన్నీ తీరిపోతాయంటూ ఇరికిస్తూ మాట్లాడుతుంది. దాంతో రుద్రాణి మీద అపర్ణ కూడా ఫైర్ అవుతుంది. ఇక తరువాయి భాగంలో రాజ్‌ని కావ్య పిలిచి అతడి సాయం కోరడం కీలకంగా మారింది. మా బాస్ ఇచ్చిన లెటర్ హెడ్‌ని నేను పోగొట్టి తప్పు చేశానండి అని రాజ్ తో కావ్య అంటుంది. మరి ఇప్పుడు మీ బాస్ సంతకం చేసిన లెటర్ హెడ్ లేకపోతే డీల్ పూర్తి చేయలేరుగా అని రాజ్ అంటాడు. నేను డీల్ పూర్తి చేయాలంటే మీరు మా బాస్ లాగా ఒక సంతకం మాత్రమే ఇందులో చేస్తే.. నేను సేఫ్ అవుతానని రాజ్ తో కావ్య అంటుంది. వెంటనే రాజ్ ఆ లెటర్ వదిలేసి.. అమ్మో.. ఏంటండీ మీరు అనేది.. నన్ను ఫోర్జరీ చేయమంటున్నారా అని అంటాడు. సరే మీ వల్ల కాదు కదా.. మీరు వెళ్లిపోండి.. నేను చూసుకుంటానని కావ్య అలిగినట్టుగా మాట్లాడుతుంది. దాంతో రాజ్ లేచి వెళ్లిపోయినట్లు.. ఆ పేపర్ మీద కావ్యే సంతకం చేయాలని ప్రయత్నించినట్లు చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
