దివ్య, కళ్యాణ్ ల మధ్య చిచ్చుపెట్టిన తనూజ
on Nov 10, 2025

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు జరిగిన దాంట్లో లేడీ కంటెస్టెంట్స్ లో దివ్య టాప్. ఎందుకంటే తను స్ట్రాటజీలు వాడుతుంది.. గేమ్ ఆడుతుంది.. అందరితో బాగుంటుంది. కానీ మన బిగ్ బాస్ మామ తనూజనే విన్నర్ ని చేద్దామని ఫిక్స్ అయ్యారు. అందుకే తను ఎంత ఇరిటేట్ అయిన అవేం చూపించకుండా ఫేక్ ఓటింగ్ వేస్తూ తనూజ టాప్(Tanuja Fake) అన్నట్టుగా చూపిస్తున్నారు బిగ్ బాస్. ఒకవేళ మేల్ కంటెస్టెంట్స్ అయితే కళ్యాణ్ ని విజేత చెయ్యాలని గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకేనేమో స్ట్రాంగ్ అండ్ జెన్యున్ కంటెస్టెంట్ అయినటువంటి దివ్య, డీమాన్ పవన్ లాంటి కంటెస్టెంట్స్ ని ఛాన్స్ దొరికినప్పుడే బ్యాడ్ చేయాలని వీడియోలు ప్లే చేసి మరీ చూపిస్తున్నారు.
నిన్నటి ఎపిసోడ్ లో దివ్యని కార్నర్ చేస్తూ వీడియోలు వేసి చూపించి కళ్యాణ్, తనూజ దృష్టిలో దివ్యని బ్యాడ్ చేశాడు బిగ్ బాస్ మామ. దివ్య ట్రైన్ టాస్క్ లో భరణికి సపోర్ట్ చేస్తూ తనూజని తీసేయ్యమని గౌరవ్ తో చెప్తుంది. అది వీడియో చూపించాడు నాగ్. దాంతో తనూజ దివ్యపై ఓ అభిప్రాయం ఏర్పర్చుకుంది. దివ్య ఎవరిని గెలిపించాలనేది తన ఆట.. తన ఆట గురించి ఎవరికీ ఏ అభ్యంతరం ఉండకూడదు.. కానీ నీ బాధ ఏంటంటే మాట ఇచ్చి మాట తప్పింది అని అంతేకదా అని కళ్యాణ్ ని నాగార్జున అడుగగా.. కొంచెం సర్ అని కళ్యాణ్ అన్నాడు. ఎవరికి వాళ్ల ఫేవరెట్స్ ఉంటారు కదా.. డీమాన్కి రీతూ కావాలని ఉంటుంది.. ఇంకెవరికో ఇమ్మాన్యుయల్ కావాలని ఉంటుంది.. నీకు తనూజ కావాలని ఉంది.. అది వాళ్ల ఛాయిస్ల బట్టి ఉంటుంది.. ఎవరిని గెలిపించాలనేది వాళ్ల ఇండివిజల్ ఛాయిస్ అని నాగార్జున అన్నాడు. అంటే దివ్య అలా మాట ఇచ్చి తప్పే రకం కాదు.. కానీ ఆ టైమ్లో తను ఇమ్మూ-తనూజ మధ్య ఓటింగ్ పడుతుందేమో అనుకొని అలా చేసి ఉండొచ్చని కళ్యాణ్ చెప్పాడు.
నేను చూపించిన వీడియో టాస్క్ స్టార్ట్ కాక ముందు.. ఒకరికి గెలిపించడానికి మనం సపోర్ట్ చేయడం, టాస్కులో ప్రాణం పెట్టడమనేది కరెక్ట్.. ఖచ్చితంగా అది చేయాలి.. కానీ ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ ఒకరి ఓటమి కోసం ఉండకూడదంటూ సోది చెప్పాడు నాగ్ మామ. హౌస్ లో ఓ గేమ్ జరిగితే ఒకరు ఓడిపోతేనే ఇంకొకరు గెలుస్తారు.. అది బేసిక్ కదా.. ఇదంతా ఎందుకు.. తనూజని దివ్య తీసేసింది కాబట్టి తనూజ, దివ్య, కళ్యాణ్ ల మధ్య చిచ్చుపెట్టి దివ్యకి సపోర్ట్ లేకుండా చేసి తనని పంపించేద్దామని ప్లాన్ చేశామని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా బిగ్ బాస్ మామ.. దివ్య ఆడిన ఆటతీరు కరెక్ట్ కానీ దానిని బిగ్ బాస్ మామ చూపించిన తీరు రాంగ్ అని మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



