Sai Srinivas Elimination: సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్.. కంటెంట్ ఇవ్వకపోవడమే మైనస్!
on Nov 9, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటితో తొమ్మిది వారాలు పూర్తయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే శనివారం నాటి ఎపిసోడ్ లో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ (ఎవిక్ట్) అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.
సండే ఫండే ఎపిసోడ్ లో మొదలవ్వగానే నామినేషన్లో ఉన్న సుమన్ శెట్టిని సేవ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికి నామినేషన్లో ఉన్నావారిని నిల్చోమన్నాడు నాగార్జున. అందులో నుండి సంజన, తనూజని సేవ్ చేశాడు. ఇక ఆ తర్వాత గేమ్ లు ఆడించాడు. పాటలు ప్లే చేసి అందులో నుండి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఇలా రెండు టీమ్ లుగా డివైడ్ చేసి ఎపిసోడ్ అంతా నడిపించాడు. ఇక ఎలిమినేషన్ ని భరణి, సాయి శ్రీనివాస్ మధ్య పెట్టాడు. గార్డెన్ ఏరియాలోనే ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. భరణి ట్రైన్, సాయి శ్రీనివాస్ ట్రైన్ అంటూ రెండు రైల్వేస్టేషన్ ల్లో ఉంచాడు. ఇక ఎవరి ట్రైన్ అయితే టన్నెల్ లో ఉంటుందో వారు ఎలిమినేట్, టన్నెల్ దాటి బయటకొస్తే వారు సేఫ్ అని నాగార్జున చెప్పాడు. కాసేపటికి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇక సాయి ట్రైన్ టన్నెల్ లో ఆగిపోగా భరణి ట్రైన్ బయట ఉంది. దాంతో సాయి యూ ఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పాడు. ఇక హౌస్ మేట్స్ అందరికి బై చెప్పేసి వచ్చేశాడు సాయి శ్రీనివాస్. నిజానికి ఈ వారం ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ జరిగింది కాబట్టి సాయికి మరో ఛాన్స్ ఇవ్వాలంటే ఇచ్చి ఉండొచ్చు. కానీ బిగ్‌బాస్ టీమ్ అలా ఆలోచించలేదు. దీంతో ఈ వారం లక్ వచ్చినట్లే వచ్చి సాయికి కిక్ ఇచ్చింది.
సాయి శ్రీనివాస్ హౌస్ లో ఒకరి గురించి ఇంకొకరి దగ్గర ఛాడీలు చెప్పాడు. అది వీడియో ప్లే చేసి మరీ చూపించాడు నాగార్జున. దాంతో హౌస్ మేట్స్ దృష్టిలో సాయి శ్రీనివాస్ నెగెటివ్ అయ్యాడు. పైగా తనూజని నామినేట్ చేశాడు సాయి. బిగ్ బాస్ దత్తపుత్రిక తనూజని నామినేట్ చేస్తే ఊరుకుంటాడా..ఫేక్ ఓటింగ్ తో తనూజని టాప్ లో ఉంచిన బిగ్ బాస్ కి.. సాయి శ్రీనివాస్ ని లీస్ట్ లో ఉంచడం పెద్ద పనేం కాదుగా.. అందుకే సాయికి లక్ కలిసి రాలేదు.. మరోవైపు మొన్నే రీఎంట్రీ ఇచ్చిన భరణికి కూడా పెద్దగా ఓటింగ్ పడట్లేదు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా భరణి ఆటలో తనూజ-దివ్యల ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ల నుంచి దూరంగా ఉండాలని భరణి ఎంత ట్రై చేస్తున్నా ఈ ఇద్దరూ మాత్రం వదలడం లేదు. వాళ్లు వాళ్లు గొడవపడి మరీ భరణిని మధ్యలో బుక్ చేస్తున్నారు. దీంతో ఆడియన్స్ దృష్టిలో భరణి ఆట ఏం కనిపించట్లేదు. మరి రాబోయే వారాలైన భరణి ఇందులో నుంచి బయటపడతాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



