Home

»

Tv News

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సిద్ధమవుతోంది... వెళ్తోంది ఎవరంటే

Aug 4, 2026 11:41AM

బిగ్ బాస్ అగ్నిపరీక్ష మరో వారంలో మొదలు కాబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఐతే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ , బిగ్ బాస్ రివ్యూయర్ ఐన ఆదిరెడ్డి రాబోయే ఎపిసోడ్ కి ఎవరెవరు వెళ్తున్నారు అనే కొంతమంది పేర్లను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. అందులో మొదటగా జపాన్ ఫుట బిగ్ బాస్ కి రాబోతున్నాడు అంటూ రాసాడు. ఈసారి అగ్ని పరీక్షలో చాలా ఇంటరెస్టింగ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. అలాగే ఈ సారి చాలా ఇంటరెస్టింగ్ గేమ్ కూడా ఉన్నాయి.

రోస్ట్ వీడియోస్ చేసే అక్షయ్, ఒక ట్రాన్స్ జెండర్ , ఆర్మీ నుంచి ఒక అమ్మాయి, ఫుట సుగానో అనే జపాన్ వ్యక్తి, మిథిలేష్ అని జిమ్ ట్రైనర్ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరి పేర్లు బయటకు వచ్చాయి. రాని వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నా. ఒక ఊరి నుంచి రాజు అనే ఒక ఇంటరెస్టింగ్ పర్సన్ ఉన్నాడు. సిక్కోలు సీమాన్ ఉన్నాడు. తెలంగాణ నుంచి శృతి అనే ఒక బాడ్మింటన్ ప్లేయర్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. వీళ్లంతా అగ్నిపరీక్ష మెగా ఆడిషన్ కి పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పుకొచ్చాడు. 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష' ఆగస్టు 15 నుండి ప్రసారం కానుంది!
అద్దిరిపోయే  టాస్క్‌లు, ఊహించని మలుపులు, హోరాహోరీ పోటీ , అంతులేని వినోదం కోసం సిద్ధంగా ఉండండి. కౌంట్‌డౌన్ మొదలైంది అంటూ బిగ్ బాస్ అప్ డేట్స్ ద్వారా తెలుస్తోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com