Home

»

Tv News

Bigg Boss 9 Telugu 10th week Voting: పదో వారం ఎలిమినేషన్ గా స్ట్రాంగ్ కంటెస్టెంట్.. డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే!

Nov 15, 2025 11:22AM

 

బిగ్ బాస్ సీజన్-9 పదో వారం ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా కంటెస్టెంట్స్ చిన్నప్పటి ఫోటోలని పంపించాడు బిగ్ బాస్. అయితే ఇందులో పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ గతం విన్న ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ వారం ఇమ్మాన్యుయల్ మినహా పది మంది నామినేషన్లో ఉన్నారు. 

నామినేషన్లో ఉన్నవారిలో తనూజకి అత్యధికంగా ఇరవై ఆరు శాతం ఓటింగ్ పడింది. అందుకే తను నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత కళ్యాణ్‌ 24.5 శాతం ఓటింగ్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టాప్‌-3లో భరణి ఉన్నాడు. భరణికి పంతొమ్మిది శాతం ఓటింగ్ పడింది.  రీతూకు ఎనిమిది శాతం ఓటింగ్ పడింది. గౌరవ్‌ కి ఏడు శాతం ఓటింగ్ తో ఐదో స్థానంలో ఉన్నాడు. దాదాపు మూడు నుంచి నాలుగు శాతం ఓట్లతో సంజనా, సుమన్‌ శెట్టి ఆరు ఏడు స్థానాల్లో నిలిచారు. ఇక దివ్య, నిఖిల్‌, డీమాన్‌ పవన్‌ లీస్ట్ లో ఉన్నారు. వీరికి మూడు శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు.‌

ఇక తాజాగా శుక్రవారం నాటి ఓటింగ్ బట్టి చూస్తే.. దివ్య, నిఖిల్‌, డీమాన్‌ పవన్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వీరిలో డీమాన్ పవన్, నిఖిల్‌ ఇంకా డేంజర్‌లో ఉన్నారు.. ఈ వారం నిఖిల్ ఎలిమినేషన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. నిఖిల్ అంత స్ట్రాంగ్‌ కంటెస్టెంట్ గా భావిస్తున్నారు. కానీ అతను ఎప్పుడు ఓటింగ్ లో బాటమ్‌లో ఉంటున్నాడు. పైగా నిఖిల్‌, దివ్యల మధ్య చాలా తక్కువ ఓట్ల డిఫరెన్స్ ఉంది. కాబట్టి వీరిలో ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది బిగ్ బాస్  నిర్ణయిస్తాడు. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com