Home

»

Tv News

Bigg Boss 10 Telugu: అమ్మను చూసి ఏడ్చేసిన రామకృష్ణ.. హౌస్ లోకి వర్షిణి తల్లి ఎంట్రీ!

Nov 15, 2026 11:24AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదో వారం ఫ్యామిలీ వీక్ జరిగింది. ఇందులో వర్షిణి, ఆర్కే ఫ్యామిలీ తప్ప మిగిలిన వారందరి ఫ్యామిలీస్ వచ్చాయి. అయితే వీకెండ్‌లో ఆ ఇద్దరికీ నాగార్జున మరో ఆప్షన్ ఇచ్చాడు. వర్షిణి, ఆర్కే ఇద్దరి తల్లులు గార్డెన్ ఏరియాలో ఉంటారు. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్ల ప్రకారం ఎవరో ఒకరి తల్లి మాత్రమే లోపలికి వస్తుందని నాగార్జున తెలిపాడు.

దీంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని చెప్తూ వర్షిణి, ఆర్కేలకు ఓట్లు వేశారు. తగిన కారణాలు చెప్తూ చెట్టు మీద వర్షిణి లేదా ఆర్కే ఫోటోను పెట్టాల్సి వచ్చింది. అక్కడ ఇద్దరు అమ్మలు ఉన్నారు అంటూ త్రిగుణ్ ఏడ్చేసి వర్షిణికి ఓటు వేశాడు. ఈ టైమ్‌లో వర్షిణికి ఎమోషనల్‌గా అమ్మ అవసరం అని ముకేష్, నీతూ ఇలా అందరూ వర్షిణి కోసం ఓటు వేశారు. ఇక ఆర్కే కోసం ఆర్పీ, శివ్, అమన్ వంటి వారు ఓటు వేశారు.

చివరకు ఏడు ఓట్లు వర్షిణికి, నాలుగు ఓట్లు ఆర్కేకి పడ్డాయి. ఆర్కే.. మీ అమ్మ గార్డెన్ ఏరియాలో ఉంది, కానీ ఇంట్లోకి రాదు అని నాగ్ చెప్పాడు. దీంతో ఆర్కే వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇంతకంటే నేను ఏం చేయలేను అమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ ఆర్కే తల్లి కూడా ఏడుస్తుంటే వర్షిణి తల్లి ఓదార్చింది. ఇక్కడి నుంచే ఏమైనా చెప్పాలని అనుకుంటే చెప్పు అని నాగ్ అనడంతో ఆర్కే తన తల్లితో మాట్లాడాడు. అమ్మ ఏడ్వొద్దు.. నేను నవ్వితే నువ్వు కూడా నవ్వుతావ్ కదా అని నవ్వించే ప్రయత్నం చేశాడు. మరోవైపు వర్షిణి తన తల్లి కన్నీటిని చూసి ఎమోషనల్ అయింది. ఆర్కే ఏడుపుతో ఆ ఎపిసోడ్ అంతా ఎమోషనల్‌గా మారిపోయింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com