.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -257 లో...... శకుంతల, పెద్దసారుకి విశ్వ ఎదురుపడతాడు. విశ్వ తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పెద్దసారు వాళ్ళని బాధపెడతాడు. పెద్దసారు వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే.. నన్ను ఎదురించే ధైర్యం లేకే వెళ్ళిపోతున్నావని విశ్వ అంటాడు. ఆ తర్వాత సుధాకి సంబంధించిన ఫోటో ఆల్బమ్ ని గంగ చూస్తుంటే వద్దని లక్ష్మీ తీసుకుంటుంది. ఇందులో అమ్మ గారి కూతురు ఫోటో ఉందట.. ఆమ్మగారు చూస్తే బాధపడుతారని లక్ష్మి అంటుంది. చిన్నప్పుడే తన పాప తప్పిపోయిందంట అని లక్ష్మి చెప్తుంది.
అప్పుడే సుధా వస్తుంది. నా కూతురు గురించి తెలిసిందా అని బాధపడుతుంది. మీరేం బాధపడకండి తొందర్లోనే దొరుకుతుందని గంగ అంటుంది. ఆ తర్వాత శకుంతల కోపంగా ఇంటికి వస్తుంది. పెద్దసారు లోపలకి .. వెళ్తు ఈ విషయం రుద్రకి చెప్పకని రంగాతో పెద్దసారు చెప్తాడు. ఆ తర్వాత అప్పుడే వచ్చేసారు ఏంటి అత్తయ్య అని ఇషిక అడుగుతుంది. పోయిందని అనుకున్న పీడ, మళ్ళీ వస్తే ఏం చేస్తామని అనేకి కోపంగా లోపలికి వెళ్తుంది శకుంతల. ఇక పెద్దసారు మాత్రం డల్ గా వస్తాడు. విశ్వ ఉంటే సుధా కూడా ఉంటుంది కదా అని పెద్దసారు అనుకుంటాడు. మరొకవైపు విశ్వ ఇంటికి వస్తాడు. అక్కడ జరిగింది మేడమ్ కి చెప్పకని విశ్వ అంటాడు.
ఆ తర్వాత రుద్ర, గంగలకి సుధా బట్టలుపెడుతుంది. సుధా, విశ్వ దగ్గర ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. సుధా స్వీట్ చేసి గంగకి ఇస్తుంది. ఆ తర్వాత శకుంతల, పెద్దసారు ఎందుకు అలా ఉన్నారో అని ఇషిక, వీరు అనుకుంటారు. రంగా చెప్తాడేమో అని ప్రయత్నం చేస్తారు కానీ అతను చెప్పడు.. అప్పుడే రుద్ర, గంగ వస్తారు. ఎక్కడికి వెళ్లారని ఇషిక అడుగుతుంది. మా
విశ్వ సర్ వాళ్ళింటికి అని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత జరిగింది మొత్తం రుద్రకి రంగా చెప్పాలని అనుకుంటాడు కానీ ఇషిక వాళ్లు ఉన్నారని ఆగిపోతాడు. ఆ తర్వాత సుధా గురించి గంగ పెద్దసారుకి చెప్తుంది. పెద్దసారు డల్ గా ఉంటే ఏమైందని రుద్ర అడుగుతాడు. ఏం లేదని పెద్దసారు అంటాడు. గంగ తెచ్చిన స్వీట్ తింటూ తన చెల్లి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు పెద్దసారు. ఆ తర్వాత పెద్దనాన్న, పెద్దమ్మ గొడవ పడ్డారా పెద్దనాన్న ఎందుకు అలా ఉన్నాడని రంగాని రుద్ర అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
