Home

»

Tv News

అమ్మమ్మ గెటప్ లో అషురెడ్డి.. ఇదే మోస్ట్ బ్యూటిఫుల్ ఫొటో షూట్ అంట!

Nov 17, 2024 11:18AM

ఇన్ స్టాగ్రామ్ లో కొందరు బుల్లితెర సెలెబ్రిటీలు చేసే ఫోటో షూట్స్ కొన్ని వైరల్ అవుతుంటాయి.  మరీ బోల్డ్ గా ఉండేలా కొంతమంది చేసేవి ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారి లిస్ట్ లో అషు రెడ్డి, అనసూయ, ఇనయా, అరియానా, సుభశ్రీ రాయగురు ఉన్నారు. వీరు రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు వీడియోలతో వైరల్ అవుతుంటారు. (Ashu Reddy)

అషు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ గా హీట్ పుట్టించే ఫొటోస్ పెట్టి సందడి చేస్తూ ఉంటుంది. అషు తరచుగా కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. ఐతే ఎన్ని ప్రోగ్రామ్స్ లో ఉన్నా కూడా సమయం తీసుకుని మరీ సోషల్ మీడియాలో తన ఫొటోస్ షేర్ చేస్తూ ఆడియన్స్ కి టచ్ లో ఉండడం మాత్రం అస్సలు మర్చిపోదు. అషురెడ్డి తాజాగా అమ్మమ్మ గెటప్ వేసుకొని కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇదే మోస్ట్ బ్యూటిఫుల్ ఫోటోషూట్ అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది అషు. సేమ్ అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే రెడీ అయ్యి నెటిజన్లకి షాకిచ్చింది. వైట్ హెయిర్ అప్పట్లో‌ ముసలివాళ్ళు ఎలా ఉంటారో అలాగే రెడీ అయి దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన వారు తెగ కామెంట్లు చేస్తున్నారు.

సడన్ గా మంచు లక్ష్మీ అనుకున్నా కదారా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇన్ని రోజులు ఎడిట్ చేసి ఫోటోలు పెట్టి, ఇప్పుడేంటి ఎడిట్ చేయకుండా పెట్టేసావా అని పటాస్ హరి కామెంట్ చేశాడు. ముసలిదే కానీ మహానుభావురాలు అని ఒకరు కామెంట్ చేశారు. ఒరిజనల్ పిక్ ఇప్పుడు పెట్టావా అంటు మరొకరు కామెంట్ చేశారు. మంచు లక్ష్మి తో చాలామంది పోల్చారు. బామ్మ గెటప్ లో ఉన్న అషు పోస్ట్ కి కామెంట్ల వర్షం కురుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com