.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-504 లో.. వల్లి, సుకన్య మాట్లాడుకుంటారు. ఆ అక్కచెల్లెళ్ళలని ఎలాగైనా మనమే ఆడుకోవాలని అనుకుంటారు. ఇక రాత్రి కాగానే కచేరి కోసం నర్మద, ప్రేమల దగ్గరికి వల్లి, సుకన్య వెళ్తారు. ఎప్పటిలాగే నర్మద, ఒక ప్రేమ కలిసి గేమ్ స్టార్ట్ చేస్తారు. ఒక కర్ర తీసుకుని కళ్ళకి గంతలు కట్టుకుంటుంది నర్మద.. ఇక ఎవరిని కొట్టాలా అని శ్రీవల్లి , సుకన్య చెప్పినప్పుడు నర్మద కొడుతుంది. అయితే టేబుల్ కింద నర్మద కాలుని ప్రేమ తొక్కుతూ తనకి హింట్ ఇస్తుంటుంది. ప్రేమని కొట్టాలా అని వల్లి అడిగినప్పుడు కాలు తొక్కదు.. వల్లి, సుకన్యల వంతు వచ్చినప్పుడు నర్మద కాలుని ప్రేమ తొక్కుతుంది. అలా వల్లి, సుకన్యలని ప్రేమ, నర్మద ఒక ఆట ఆడుకుంటారు.
ఇక సుకన్య దెబ్బలతో డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉంటే అప్పుడే అక్కడికి తిరుపతి వస్తాడు. ఏం అయిందని అడుగుతాడు. దోమలు కుట్టాయని సుకన్య కవర్ చేస్తుంది. ఇక తిరుపతి అది నిజమనుకొని బొగ్గులపై సామ్రానీ వేసుకొని తీసుకొని వచ్చి తన దగ్గర పెడతాడు. ఆ పొగకి దోమలు కాదు నేను పోయేలా ఉన్నానని దానిని పడేస్తుంది. ఇక తిరుపతి నడుస్తుంటే చూసుకోకుండా కాలుతున్న బొగ్గులపై కాలు వేస్తాడు. దాంతో అతని కాలు కమిలిపోతుంది. ఇక అదే అదునుగా చేసుకొని తిరుపతిని ఇల్లంతా నడిపిస్తుంది సుకన్య. మరోవైపు ధీరజ్ కోసం చూస్తుంటుంది ప్రేమ. అదేసమయంలో తనకి కాల్ వస్తుంది.
ఆడియన్స్ కోసం ప్రేమకి మేనేజర్ కాల్ చేస్తాడు. ప్రేమ వాయిస్ విని ఫిధా అవుతాడు. ఇక తన డ్యాన్స్ బాగుందని చెప్పి రమ్మని చెప్పగా ప్రేమ సరేనంటుంది. అయితే మేనేజర్ డబుల్ మీనింగ్ తో మాట్లాడతాడు. అది ప్రేమకి అర్థం కాదు. ఆ డ్యాన్స్ లో గెలిస్తే పదిలక్షలు వస్తాయని అతను చెప్పడం మాత్రమే విని సరే వస్తానంటు చెప్తుంది. ఇక ఆ సంతోషంలో ధీరజ్ తో పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుంది. అది చూసిన ధీరజ్.. చాలా బాగా చేశావని చెప్తాడు. ఏంటి విషయం అని ధీరజ్ అడుగగా.. ఇలా డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది.. అందులో గెలిస్తే పదిలక్షలు వస్తాయని ప్రేమ చెప్తుంది. వద్దని ధీరజ్ అంటాడు. ఎందుకని ప్రేమ అడుగగా.. నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్పినందుకే మీ వాళ్ళు రచ్చ చేశారు..ఇక ఇప్పుడు డ్యాన్స్ అంటే మా ఇంటికి కత్తులు పట్టుకొని వస్తారని ధీరజ్ చెప్పేసి వెళ్తాడు. ప్రేమ ఏం చెప్పినా పట్టించుకోడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
