డ్రామా జూనియర్స్ ఎపిసోడ్స్ కింద కామెంట్స్ పెట్టిస్తున్న సుధీర్..
on Jun 27, 2025
డ్రామా జూనియర్స్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో బోనాల స్పెషల్ తో రాబోతోంది. ఇందులో ప్రోమో స్టార్టింగ్ లో పంచ్ లు పేలిపోయాయి. అందరూ కొత్త కొత్త కాస్ట్యూమ్స్ తో అలరించారు. ఇక సుధీర్ రోజాకి ప్రసాదం తినిపించాడు. బోనాలతో ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కి నో ఎండ్ అన్నాడు సుధీర్. "బోనాల గురించి ఎవరికైనా తెలుసా" అని సుధీర్ అడిగాడు. దానికి లాస్య వెరైటీ ఆన్సర్ ఇచ్చింది. "పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేయాలి. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ డిన్నర్ గురించి ఎం చేసుకోవాలి అన్నది ప్రేపరషన్" అంటూ అమాయకంగా చెప్పింది. బోనాల గురించి చెప్పమంటే భోజనాల గురించి చెప్తావేంటమ్మా అంటూ సుధీర్ లాస్య మీద కౌంటర్ వేసాడు.
బోనాలు అంటేనే డ్రామా జూనియర్స్ గుర్తు రావాలి అన్నాడు. తర్వాత రోజా చేరుకోల సుధీర్ కి ఇచ్చి "దీంతో కొట్టుకుంటే మోత మోగి పోవాల్సిందే" అంది. టెలికాస్ట్ అయ్యిందిగా ఎపిసోడ్ దాని కింద ఎన్ని కామెంట్స్ ఉంటే అన్ని దెబ్బలు కొట్టుకుంటే చాలు" అంది. "ఏంటి 364 కామెంట్సా" అని షాకయ్యాడు సుధీర్. "ఇలా అని తెలిస్తే అన్ని కామెంట్స్ పెట్టించేవాడివి కాదు కదా" అంటూ పక్కనుండి మరో కౌంటర్ వేశారు అనిల్ రావిపూడి. ఇక ఈ డ్రామా జూనియర్స్ లో చిచ్చర పిడుగు ఇర్య సుబ్రహ్మణ్యం ఐతే కర్ర తీసుకుని అనిల్ రావిపూడిని, రోజాని, సుధీర్ ని కొట్టేసింది. సుధీర్ ని ఏ,బి,సి,డిలు ఎన్ని అని అడిగింది. 26 అని చెప్పాడు. కాదు 4 అని చెప్పి బాది పారేసింది. సుధీర్ ఐతే కుయ్యో మొర్రో అంటూనే ఉన్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
