Home

»

Tv News

సెక్స్ ట్రాఫికింగ్ సర్వైవర్‌లకు సుమ సాయం..

Nov 24, 2024 3:54PM

యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ ఫుల్ జోష్ తో నిండిపోతుంది. ఏ కార్యక్రమానికైనా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. అది మూవీ రిలీజ్ ఫంక్షన్ ఐనా, షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఐనా, యాడ్స్ లో కామెడీ చేయాలన్నా ఏదైనా సుమ నిత్యం కనిపిస్తూ అలరిస్తూనే ఉంటుంది. అలాంటి సుమ ఒక్క యాంకర్ మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది సుమ. ఈ ఫౌండేషన్ ద్వారా 30కి పైగా విద్యార్థులకు, సెక్స్ ట్రాఫికింగ్ సర్వైవర్‌లకు సహాయం అందించినట్లు తెలుస్తోంది. 

అలాగే 200 పైగా కంటి చికిత్సలు, 2 వేలకు పైగా కంటి పరీక్షలు  కూడా చేయించిందట. అంతేకాకుండా ఎన్నో అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు కొంతమంది ట్రాన్స్జెండర్స్  బతుకుదెరువు కోసం కొన్ని షాప్స్ కూడా ఏర్పాటు చేయించింది సుమ. అలాగే 100 మంది సీనియర్ సిటిజన్స్ ఉండేలా నెక్స్ట్ ఓల్డేజ్  హోమ్  ని సుమ ఏర్పాటు చేసింది. ప్రతీ పండగకు ఎదో ఒక స్పెషల్ ఈవెంట్ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణం చాలా మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది సుమ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com