Home

»

Tv News

బిగ్ బాస్ ఫ్రెండ్స్‌తో ధూమ్ ధామ్‌గా లాస్య బ‌ర్త్‌డే పార్టీ!

Sep 4, 2021 3:48PM

 

యాంక‌ర్‌, బిగ్ బాస్ కంటెస్టెంట్ లాస్య మంజునాథ్ ఇటీవ‌ల‌ స్నేహితులు, స‌న్నిహితుల మ‌ధ్య పుట్టిన‌రోజు జ‌రుపుకుంది. మాదాపూర్‌లోని ఆహ్వానం క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో సంద‌డి సంద‌డిగా జ‌రిగిన ఈ వేడుక‌ల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ల‌యిన హిమ‌జ‌, రోహిణి, శివ‌జ్యోతి, మెహ‌బూబ్‌తో పాటు శ్రీ‌వాణి లాంటి టీవీ తార‌లు కూడా పాల్గొన్నారు. వారితో క‌లిసి లాస్య డాన్సులు కూడా చేసింది. ఈ సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది లాస్య‌. 

ఆ ఫొటోల‌ను చూస్తుంటే బ‌ర్త్‌డే బ్యాగ్రౌండ్‌ను చాలా అందంగా, గ్రాండ్‌గా డెక‌రేష‌న్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్‌తో లాస్య పార్టీని బాగా ఎంజాయ్ చేసింది. ఫ్యాన్స్ ఆమెకు బ‌ర్త్‌డే విషెస్‌తో కామెంట్ సెక్ష‌న్‌ను ముంచెత్తారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com