Illu illalu pillalu : అదంతా ఆనందరావు కల.. రాజమాత ఆర్డర్ తప్పితే అంతే!
on Jul 26, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -220 లో..... ప్రేమ, నర్మద నడుచుకుంటూ వెళ్తు ప్రొద్దున శ్రీవల్లి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటారు. శ్రీవల్లికి పెత్తనం రావడం వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఎన్నోసార్లు గొడవ అయింది కానీ ఇలా ఇంటికి వెళ్తానని ఓవర్ యాక్టింగ్ చెయ్యలేదు. ఇందులో వాళ్ల అమ్మ హస్తం ఉందేమోనని డౌట్ అనీ నర్మద అనగానే అవును అక్క నాకు అనిపిస్తుందని ప్రేమ అంటుంది.
మనం వాళ్ల గురించి తెలుసుకొని వాళ్ల బంఢారం బయటపెట్టాలని ఎక్కడ అయితే.. ఆపేసామో అక్కడ నుండి మొదలు పెడుదామని ప్రేమ, నర్మద అనుకుంటారు. ఆ తర్వాత భాగ్యం తన ఫ్యామిలీ గురించి ప్రేమ, నర్మద తెలుసుకొని రామరాజుకి చెప్పి తనని భాగ్యం ఉన్న ఇంటికి తీసుకొని వస్తారు. రామరాజు ని చూసి భాగ్యం షాక్ అవుతుంది. నన్ను ఇంత మోసం చేస్తారా అని ఆనందరావు ని లాక్కొని వెళ్లి శ్రీవల్లి దగ్గర పడేసినట్లు శ్రీవల్లిని ఇంట్లో నుండి గెంటేసినట్లు ఆనందరావు కల కంటాడు. ఒక్కసారిగా ఉల్లిక్కిపడి లేచి మన అమ్మాయిని ఇంట్లో నుండి గెంటేసినట్లు కల వచ్చిందని చెప్పగానే అలా జరగనివ్వను మన జోలికి ఆ నర్మద రాకుండా చేస్తానని భాగ్యం అంటుంది.
మరోవైపు నర్మద వెళ్తుంటే సాగర్ పక్కనుండి వెళ్లిన మాట్లాడడు. పాపం నీ కష్టం ఎవరికి రాకూడదంటూ వెటకారంగా భాగ్యం వచ్చి నర్మదతో మాట్లాడుతుంది. తరువాయి భాగంలో ధీరజ్, ప్రేమ వచ్చేసరికి శ్రీవల్లి డోర్ వేస్తుంది. ప్రొద్దున రాజమత ఆర్డర్ వేసింది కదా టైమ్ కి రావాలని అని ధీరజ్ తో ప్రేమ అంటుంది. ఆకలిగా ఉందే అని ప్రేమతో ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



