Home

»

Tv News

Agnipariksha season2: స్టేజ్ మీదే గడ్డం మీసం తీసేసిన కంటెస్టెంట్.. హైఓల్టేజ్ డ్రామా!

Aug 19, 2026 9:52AM

బిగ్ బాస్ సీజన్ 10 కి మరికొన్ని  రోజులు మాత్రమే ఉంది. దానికోసం అగ్నిపరీక్ష  సీజన్ 2 మొదలైంది. ఇక ఇందులో సెలక్షన్స్ జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో.. లక్ష్మీ దీపక్ సేనాపతి బిగ్ బాస్ అగ్నిపరీక్ష స్టేజ్ మీదకి వచ్చినప్పుడే అందరి కళ్లు అతని మీద పడ్డాయి. క్రికెట్ పిచ్చి ఉన్న కుర్రాడు అంట. 2021 వరకు ఆటలోనే ఉన్నా, తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆడటం ఆపేసాడు. అక్కడి నుంచి యాక్టింగ్, మోడలింగ్ వైపు టర్న్ తీసుకున్నాడు. జర్నీ చెప్తూ చెప్తూనే.. నేను మారాననే ఫీల్ ఇచ్చాడు. కానీ జడ్జ్ లు మాత్రం అంత ఈజీగా వదల్లేదు.

 

అసలు ట్విస్ట్ అంతా ట్రిమ్మర్ తోనే మొదలైంది. శ్రీముఖి.. ఇది ఎందుకు ఇచ్చామని అడిగితే.. ముందు హెయిర్ అనుకున్నాడు. తర్వాత.. మీసం, గడ్డం తీస్తా అన్నాడు. కానీ ఫాంలో.. మీసం తీయనని రాసి ఉండటంతో అక్కడే దొరికిపోయాడు. బిందు మాధవి, నవదీప్, శ్రీముఖి అందరు కలిసి..‌ మమ్మల్ని మోసం చేయాలని చూసావా అని టైట్ గా పట్టుకున్నారు. చివరికి కావాలనే అలా రాసా అని ఒప్పుకుని, స్టేజ్ మీదే గడ్డం మీసం తీసేసాడు. అతి తెలివి చూపించడం అతనికి మైనస్ అయ్యింది. అయినా నవదీప్.. ఇది కూడా ఒక క్వాలిటీ, నెక్స్ట్ ఏం చేస్తాడో చూద్దామని ఛాన్స్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. అంటే దీపక్ లో రిస్క్ తీసుకునే గట్స్ ఉంది‌ కానీ నిజాయితీని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. క్రికెట్ నుంచి ఆర్ట్ వరకు వచ్చిన అతని స్ట్రగుల్ నిజమే అయితే, హౌస్ లోపల అతని గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. అతను ఎంత దూరం వెళ్తాడో చూడాలి మరి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com