Home

»

Tv News

ఇండస్ట్రీకి వచ్చాక ఆ యాంకర్ తొలి ప్రేమ శేఖర్ మాష్టర్ 

Jul 27, 2026 10:39AM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ ఎపిసోడ్ కి  "చెన్నై లవ్ స్టోరీ" మూవీ టీమ్ నుంచి  కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియా వచ్చారు. ఇక వీళ్ళు రావడంతో ఈ ఎపిసోడ్ కి ఫ్రెండ్స్ గా వచ్చిన వాళ్ళ లవ్ స్టోరీస్ అన్నిటినీ విన్నది శ్రీముఖి. ఫ్రెండ్స్ గా ఎవరెవరు వచ్చారంటే శేఖర్ మాష్టర్ -  రఘు మాష్టర్  , రవి కృష్ణ - నవ్య స్వామి, నిఖిల్ విజయేంద్ర సింహ - సుప్రీతా, ధనరాజ్ - బలగం వేణు వచ్చారు. ఇందులో నిజామాబాద్ లవ్ స్టోరీ పోస్టర్ వచ్చేసరికి శ్రీముఖి తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది.

" నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కి నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ఫిలిం వచ్చి జులాయి  అల్లు అర్జున్ గారికి చెల్లిగా చేసాను. కాబట్టి హీరోకి లైన్ వేసే స్కోప్ లేదు. ఆ టైములో ఒక అబ్బాయి పక్కన కూర్చుని అలా రాసుకుంటున్నాడు. వెయిట్ చేస్తున్నాడు. నిజ్జం చెప్తున్నా ఎవరేమనుకున్నా పర్లేదు. ట్రస్ట్ మీ అబ్బాయిని చూసినప్పుడు అబ్బా ఏమున్నాడు అనుకున్నాను. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనే మా శేఖర్ మాష్టర్. నా తొలి ప్రేమ ఇండస్ట్రీకి వచ్చాక శేఖర్ మాష్టర్ " అని చెప్పేసింది. ఇక అందరూ శేఖర్ మాష్టర్ వంక చూసారు. బ్యాక్ గ్రౌండ్ లో మాష్టారు మాష్టారు సాంగ్ ప్లే చేశారు.

అప్పుడే నీ ప్రేమను చెప్పుంటే పెళ్ళైపోయేదిగా హ్యాపీగా అన్నాడు హరి. అప్పటికల్లా శేఖర్ మాష్టర్ కి పెళ్లయిపోయింది అని చెప్పింది శ్రీముఖి.  జులాయి  టైంకా అని ఆలోచిస్తూ ఉన్న శేఖర్ మాష్టర్ ని అవినాష్ ఒక ప్రశ్న అడిగాడు. "ఒక వేళా ఆ టైంకి పెళ్లవ్వకపోతే శ్రీముఖి లాంటి అమ్మాయి ప్రొపోజ్ చేస్తే చేసుకునేవాల్లా " అని అడిగాడు. "కచ్చితంగా శ్రీముఖి లాంటి అమ్మాయి ప్రొపోజ్ చేస్తే చేసుకొని వాడు ఎవడు. " అని చెప్పాడు శేఖర్ మాష్టర్. దాంతో శ్రీముఖి తెగ సిగ్గుపడిపోయి శేఖర్ మాష్టర్ భుజాలపై వాలిపోయింది."సీరియస్ గా శ్రీముఖి మంచి మొగుడు వస్తాడు " అంటూ షాక్ హ్యాండ్ ఇచ్చాడు శేఖర్ మాష్టర్.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com